దశాబ్ది సంబురాలు అంబరాన్ని అంటాలి:-మంత్రి పువ్వాడ

తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల సంబురాలు( Telangana State Decade Celebrations అంబరాన్ని తాకేలా నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్( Minister Puvvada Ajay Kumar ) అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదిఏళ్లుగా సాధించిన విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లాల రూపొందించిన ప్రణాళికను ఆయన నివేదించారు.
తెలంగాణా రాష్ట్రము( ( Telangana State ) ఆవిర్బవించి తొమ్మిది ఏళ్ళు పూర్తి చేసుకుని పదో ఏట అడుగిడుగుతున్న సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వము జూన్ 2 నుండి 22 వరకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమేనని, ఈ క్రమంలోనే దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్ల పై బుధవారం మేయర్ పునుకొల్లు నీరజ అద్వరంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేటర్ లు, అధికారులతో సమావేశం నిర్వహించారు.

 Minister Puvvada Ajay Kumar About Telangana Decade Celebrations, Puvvada Ajay Ku-TeluguStop.com

జూన్ 2వ తేదీన నుండి జరుగనున్న ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ విధిగా పాల్గొనాలని సూచించారు.

ఇలాంటి అవకాశం మనకు దక్కడం గర్వకారణమన్నారు.ఇలాంటి అవకాశం మళ్ళీ మనకు రావాలి అంటే మరో 10ఏళ్లు ఎదురు చూడాలని, అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదన్నారు.

మనకు వచ్చిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ముఖ్యమంత్రి కేసీఅర్( CM KCR ) పాలనలో తొమ్మిదేళ్లుగా జరిగిన ప్రగతి కొండంత అని కానీ మనం చెప్పుకునేది గోరంత అని ఆయన చెప్పారు.

మీ డివిజన్ ల పరిధిలో జరిగే ప్రతి కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా హాజరుకావాలని, ప్రతి కార్యక్రమంలో నాన్-వెజ్ తో భోజనాలు తప్పక ఏర్పాటు చేయాలన్నారు.

ఈ సందర్భంగా ఖమ్మంలో జరిగిన అనేక అభివృద్ది పనుల నాడు – నేడు పోస్టర్( Nadu-Nedu ) ను ఆవిష్కరించారు.

జిల్లా కలెక్టర్ VP గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ విజయ్ కుమార్, అదనపు మున్సిపల్ కమిషనర్ మల్లీశ్వరి, కార్పొరేటర్లు, అధికారులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube