మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది.మోట్లతండాలో సర్పంచ్ ను ఓ యువకుడు చెప్పుతో కొట్టిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
గ్రామంలో అభివృద్ది జరగడం లేదంటున్న స్థానికులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.గ్రామ సభలో అభివృద్ధి పనుల నిధులపై సర్పంచ్ ను ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే సర్పంచ్ బానోతు సుమన్ నాయక్ ను మహేశ్ అనే యువకుడు చెప్పుతో కొట్టాడు.అభివృద్ధి జరగడం లేదని, దాంతో పాటు మౌలిక సదుపాయాలు కరువయ్యాయని మహేశ్ ఆరోపిస్తున్నారు.







