రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాల నిర్వహణపై జెడ్పీటీసీ కత్తెర పాక ఉమా కొండయ్య లతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు.సమావేశానికి ఆయా శాఖల అధికారులు పాల్గొనగా ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ( MPP Parlapalli Venugopal )మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మండల కేంద్రం తో గ్రామ స్థాయి లో ప్రతి రోజూ నిర్వహించు కార్యక్రమాలను ప్రజా ప్రతినిధుల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని, కార్యక్రమం మొదలు నుంచి ముగింపు వరకు ప్రతి అంశాన్ని ముందుగా ఎవరు, ఏ కార్యక్రమాలు నిర్వహించాలి అనే అంశం నిర్ధారించుకొని, విధులను కేటాయించుకొని కార్యక్రమం విజయవంతం చేయాలని అన్నారు.
ప్రతి కార్యక్రమంతో పాటు, ప్రత్యేకంగా జూన్ 3న రైతు దినోత్సవం, జూన్ 7న సాగునీటి దినోత్సవం, జూన్ 8న ఊరూరా చెరువుల పండుగ నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
రైతు వేదిక క్లస్టర్ పరిధిలో ఉన్న 3, 4 గ్రామాల నుంచి రైతులను ట్రాక్టర్, ఎడ్ల బండ్లలో ర్యాలీ లాగా ఉదయం 10 గంటల లోపు రైతు వేదికలను చేరుకోవాలని, వ్యవసాయ శాఖలో సాధించిన ప్రగతి గ్రామాల వారీగా రైతులకు తెలియ జేయాలని, రైతు బంధు, రైతు బీమా( Rythu Bandhu, Rythu Bima ), ఉచిత విద్యుత్ మొదలగు వివిధ పథకాల ద్వారా ప్రతి రైతుకు జరుగుతున్న లబ్ది, యాసంగి లో ముందస్తు సాగు ప్రణాళిక, ఆయిల్ పామ్ సాగు కు ప్రభుత్వం అందిస్తున్న సబ్సీడీల పై ప్రత్యేకంగా వివరించాలని తెలిపారు.
రైతుబంధు సమితి సభ్యులతోసమన్వయం చేసుకుంటూ రైతులను సమీకరించాలని, క్లస్టర్ వారీగా ప్రత్యేక అధికారులను నియమించాలని, రైతు వేదిక దగ్గర ఏర్పాట్లు ప్రత్యేకంగా పరిశీలించాలని, పరిసరాల పరిశుభ్రత, భోజన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని, అన్నారు.ముఖ్యంగా జూన్ 7న సాగునీటి దినోత్సవం సందర్భంగా గ్రామాల పరిధిలో వేడుకలు నిర్వహించాలని, సాగునీటి రంగంలో సాధించిన విజయాలు ఘనంగా చాటాలని తెలిపారు.
జూన్ 8న నిర్వహించు ఊరూరా చెరువుల పండుగ కోసం ప్రజా ప్రతినిధులను సంప్రదించి ప్రతి గ్రామంలో పెద్ద చెరువు ఎంపిక చేయాలని, చెరువు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఊరూరా చెరువుల పండుగ సందర్భంగా ప్రతి గ్రామంలో వేడుకలు, భోజన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని , బతుకమ్మ, బోనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు నిర్వహించాలని, కట్ట మైసమ్మ పూజ చేయాలని తెలిపారు.
దశాబ్ది వేడుకల ప్రతి కార్యక్రమాన్ని తప్పనిసరిగా ఫోటోగ్రఫీ, వీడియో గ్రాఫీ రికార్డు చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో జెడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్య, తహసిల్దార్ నరేష్ ఎంపీడీవో నల్ల రాజేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య ,ఇరిగేషన్ డిఈ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి ప్రణీత, మండల విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు ,ఏపీవో సబిత,ఇరిగేషన్ హరీష్, మండల పంచాయతీ అధికారి గంగా తిలక్, కార్యదర్శులు, ఐకెపి సీసీలు, ఏఈవోలు సర్పంచులు కన్నం మధు, కొరేపు నరేష్,నాయకులు గుంటి శంకర్, సంబ లక్ష్మి రాజం, ఈడుగు స్వామి, కందుల గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.







