తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సీనియర్ నటుడు వెంకటేష్ (Venkatesh) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.అయితే ఈయన ప్రస్తుతం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే.
ఇలా సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి వెంకటేష్ తాజాగా అహింస సినిమా(Ahimsa Movie) ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.దగ్గుబాటి అభిరామ్ (Abhiram) హీరోగా ఇండస్ట్రీకి పరిచయమవుతూ అహింస సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్న విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమా జూన్ రెండవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలనీ నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం నిర్వహించిన ప్రెస్ మీట్ (Press Meet) కార్యక్రమంలో వెంకటేష్ పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఈయనకు రానా నాయుడు (Rana Naidu) వెబ్ సిరీస్ గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ లో బోల్డ్ సీన్స్ గురించి విలేకరులు వెంకటేష్ ను ప్రశ్నించారు.
అయితే మొదటిసారి రానా నాయుడు వెబ్ సిరీస్ లోని బోల్డ్ సన్నివేశాల గురించి వెంకటేష్ స్పందించారు.

ఈ సందర్భంగా ఈ వెబ్ సిరీస్ గురించి వెంకటేష్ మాట్లాడుతూ… రానా నాయుడు వెబ్ సిరీస్ లో ఉన్నటువంటి బోల్డ్ సన్నివేశాల గురించి ఆలోచిస్తూ కూర్చోవడం కంటే ముందుకు వెళ్లడం ఎంతో మంచిదని తెలిపారు.ఈ సిరీస్ కు చాలా మంచి రెస్పాన్స్ వస్తుందని వెంకటేష్ వెల్లడించారు.ఇక ఫస్ట్ సీజన్లో ఈ సిరీస్ లో కొన్ని సన్నివేశాలు అందరిపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయన్నమాట వాస్తవమేనని తెలియజేశారు.
కానీ తరువాత సీజన్లో ఇలాంటి సన్నివేశాలు ఉండవని తరువాత సీజన్ అందరికీ నచ్చేలాగే ఉంటుంది అంటూ ఈ సందర్భంగా రానా నాయుడు సిరీస్ గురించి వెంకటేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







