ఏపీలో వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీ వివాదం మరింత ముదిరింది.ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఇరు పార్టీల మధ్య బ్యానర్ వార్ నడుస్తోంది.
చౌరస్తాలలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, బ్యానర్లను రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం చించేస్తున్నారు.సీఎం జగన్ ను కించపరుస్తున్నారని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
మరోవైపు పవన్ కల్యాణ్ ను అవమానిస్తున్నారని జనసేన మండిపడుతుంది.ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య వివాదం చెలరేగి ఘర్షణలకు దారి తీస్తుంది.
ఇప్పటికే విజయనగరం, ఒంగోలులో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోగా తాజాగా తిరుపతి జిల్లా గూడూరులో ఫ్లెక్సీ వార్ నెలకొంది.







