మామూలుగా కోపం అనేది ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది.ఇక సందర్భం బట్టి ఆ కోపమనేది బాగా ఎక్కువ అవుతూ ఉంటుంది.
అయితే అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డికి కూడా బాగా కోపం ఉంటుంది అని కోపం వస్తే అసలు ఊరుకోదు అని.ఆ సమయంలో ఎవరు అని కూడా చూడకుండా వారిని ఏకీపారేస్తుంది అని తెలిసింది.టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ( Allu Arjun )గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.హీరోగా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకెళ్తున్నాడు.
ఒకవైపు ఫ్యామిలీ బాధ్యతలను మోస్తూనే మరోవైపు కెరీర్ ను ముందుకు నడిపిస్తున్నాడు.అయితే ఈయన ఫ్యామిలీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదని చెప్పాలి.
ముఖ్యంగా ఈయన భార్య స్నేహారెడ్డి( Snehareddy ) మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది సంపాదించుకుంది.సోషల్ మీడియా ద్వారా ఏ స్టార్ హీరో భార్య అందుకోని క్రేజ్ ను సంపాదించుకుంది.ఎక్కువ సంఖ్యలో ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది స్నేహారెడ్డి.స్నేహ రెడ్డి – అల్లు అర్జున్ లది లవ్ మ్యారేజ్ అని అందరికీ తెలిసిందే.కొంతకాలం ప్రేమించుకున్న వీరు కుటుంబ సభ్యులతో ఒప్పించి గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు.ఇక వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు.
తన పాపను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు అల్లు అర్జున్.ఇక స్నేహ రెడ్డి చూడడానికి హీరోయిన్ మాదిరిగా ఉన్నప్పటికీ కూడా ఆమె మాత్రం సినిమాలపై అసలు ఆసక్తి చూపించదని తెలుస్తుంది.
కేవలం ఇంటిపట్టు ఉంటూ పిల్లల బాధ్యతలను, బిజినెస్ లను చూసుకుంటుందని తెలిసింది.ఇక ఈ మధ్య స్నేహ రెడ్డి అందాలు కూడా ఆరబోస్తుందని చెప్పాలి.స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం మించకుండా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా షో చేస్తుంది.పైగా అల్లు అర్జున్ సపోర్ట్ కూడా ఎక్కువగా ఉండటంతో అస్సలు తగ్గట్లేదు స్నేహ రెడ్డి.
ఈమెకు అందం ఒకటే కాదు కోపం కూడా ఎక్కువ అని తెలిసింది.గతంలో ఒక స్టార్ హీరోయిన్ కి కూడా కోపంతో వార్నింగ్ ఇచ్చిందని తెలిసింది.కారణం ఆ హీరోయిన్ బన్నీ వెంబడి పడుతుందని.ప్రతిసారి ఆయనకు ఫోన్ చేసి విసిగిస్తుందని.
దీంతో బన్నీ.ఫ్యాన్స్ అభిమానం అలాగే ఉంటుందని లైట్ తీసుకున్నాడని తెలిసింది.
ఇక స్నేహ రెడ్డి కూడా అలాగే అనుకొని లైట్ తీసుకుందట.
కానీ ఆ హీరోయిన్ షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా బన్నీకి పదేపదే ఫోన్ చేసి విసిగించడంతో.వెంటనే కోప్పడిన స్నేహ రెడ్డి ఆ స్టార్ హీరోయిన్ కి తిరిగి ఫోన్ చేసి ఇంకోసారి ఇలా చేస్తే నీ బాగోతం సోషల్ మీడియాలో పెడతా అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చిందని తెలిసింది.దీంతో ఆ హీరోయిన్ దెబ్బకి సైలెంట్ అయ్యిందని తెలిసింది.
ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.