రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”ఆదిపురుష్”( Adipurush ).ప్రభాస్ హీరోగా, కృతి సనన్( Kriti Sanon ) హీరోయిన్ గా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్( Director Om Raut ) దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ వండర్ కోసం ఆడియెన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాను టి సిరీస్ సంస్థ, రిట్రో ఫైల్స్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మించారు.
ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా.
కృతి సనన్( Kriti Sanon ) సీతగా నటించింది.అలాగే సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan )రావణాసురిడిగా నటిస్తుండగా.
సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.వచ్చే నెల గ్రాండ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుండి వరుసగా అప్డేట్ లను ఇస్తూ ఆడియెన్స్ లో మరింత ఇంట్రెస్ట్ కలిగించేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ అయ్యింది.కొద్దిసేపటి క్రితం ”రామ్ సీతారామ్”( Ram Sitaram ) అనే సాంగ్ ను భారీ స్థాయిలో అన్ని ఇంటెర్టైనింగ్ ప్లాట్ ఫామ్ లలో రిలీజ్ చేసారు.తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి ఈ సాంగ్ ను రిలీజ్ చేసారు.సచేత్ – పరంపర స్వయం ఈ పాటకు సంగీతం అందించగా రామజోగయ్య శాస్త్రి ఈ పాటను రాసారు.
ఈ పాటలో ప్రభాస్, కృతి సనన్ తో పాటు గ్రాఫిక్స్ కూడా ఆకట్టు కున్నాయి.లంకలో ఉన్న సీత నుండి ఆంజనేయుడు ఉంగరాన్ని తీసుకొచ్చి ఇవ్వడం, రాముడు సీత కోసం ఎదురు చూపులు చూడడం వంటి విజువల్స్ ఈ పాటలో కనిపించగా బాగా ఆకట్టు కున్నాయి.ఇక జూన్ 16న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.