మెగాస్టార్ చిరంజీవికి( Chiranjeevi ) క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.68 సంవత్సరాల వయస్సులో కూడా చిరంజీవి ఎనర్జిటిక్ గా కనిపించడంతో పాటు వరుసగా సినిమాలలో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.త్వరలో చిరంజీవి నాలుగు కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది.చిరంజీవి సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ సినిమాలలో జగదేక వీరుడు అతిలోకసుందరి( Jagadeka Veerudu Athiloka Sundari ) ఒకటనే సంగతి తెలిసిందే.
రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కి 1990 సంవత్సరం మే 9వ తేదీన విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే 15 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చెసుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఫాంటసీ జానర్ లో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాను క్లాసిక్ మూవీ అని చెప్పవచ్చు.
ఈ సినిమా నంది అవార్డుల విషయంలో కూడా అప్పట్లో అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది.

చిరంజీవికి అప్పట్లో ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో అభిమానం ఉండేది.ఈ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి 105 డిగ్రీల జ్వరంతో బాధ పడ్డారు.అయినప్పటికీ జ్వరంతో ఉన్నా షూటింగ్ ఆగకుండా ఈ సినిమా అనుకున్న తేదీకి రిలీజ్ అయ్యే విధంగా మెగాస్టార్ ఎంతో కష్టపడ్డారు.
విజయవాడలో ( Vijayawada ) జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ రిలీజ్ రోజున మ్యాట్నీ టికెట్ ఏకంగా 210 రూపాయలకు బ్లాక్ లో అమ్ముడైంది.

6.50 రూపాయల టికెట్ 32 రెట్లు ఎక్కువ మొత్తానికి అమ్ముడవడం అంటే రికార్డ్ అనే చెప్పాలి.చిరంజీవిని ఆయన అభిమానులు ఏ స్థాయిలో అభిమానిస్తారో చెప్పడానికి ఇంతకు మించిన సాక్ష్యం అయితే అవసరం లేదు.
ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు దటీజ్ మెగాస్టార్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు.







