సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు సెలబ్రిటీల పరువు పోవడానికి వాళ్ల పేరెంట్స్, మేనేజర్లు, సన్నిహితులు కారణమవుతుంటారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరో కెరీర్ ను ఆ హీరో తల్లి నాశనం చేసిందని కథలుకథలుగా చెబుతుంటారు.
మరి కొందరు హీరోయిన్లు అయితే మేనేజర్లు చేసిన తప్పుల వల్ల స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించే అవకాశాలను మిస్ చేసుకున్న సందర్భాలు అయితే ఉన్నాయని వెల్లడించారు.
కోలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో అజిత్ ( Ajith ) ఒకరనే సంగతి తెలిసిందే.
అజిత్ సాధారణంగా ఇతరుల మంచి కోరుకుంటారు.వివాదాలకు సైతం ఈ స్టార్ హీరో దూరంగా ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అజిత్ వయస్సు పెరుగుతున్నా యాక్షన్ సినిమాలలో నటిస్తూ సత్తా చాటుతున్నారు.తాను స్టార్ హీరో అయినా సింపుల్ గా ఉండటానికి అజిత్ ఇష్టపడతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే ఈ స్టార్ హీరోను ఒకానొక సందర్భంలో మీనా తల్లి( Meena Mother ) ఘోరంగా అవమానించారని సమాచారం.అజిత్, మీనా కాంబినేషన్ లో పలు సినిమాలు తెరకెక్కగా ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.ఆనంద పూంకట్రు( Ananda Poonkaantrae Movie ) అనే సినిమాలో అజిత్, మీనా కలిసి నటించగా ఆ సినిమా సక్సెస్ సాధించడంతో పాటు ఉత్తమ నటుడిగా అజిత్ కు అవార్డ్ దక్కింది.
హీరోయిన్ మీనా చేతుల మీదుగా అజిత్ ఈ అవార్డును అందుకోవడం జరిగింది.అయితే ఆ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన యువతి స్టేజ్ పై అజిత్, మీనా కలిసి డ్యాన్స్ చేస్తే చూడాలని ఉందని కోరారు.ఈ కామెంట్ విన్న వెంటనే మీనా తల్లి స్టేజ్ పైకి వెళ్లి మీనా చేయి పట్టుకుని లాక్కుని వెళ్లారు.
మీనా తల్లి ఈ విధంగా చేసి అజిత్ ను దారుణంగా అవమానించారు.అయితే అజిత్ మాత్రం ఈ ఘటన గురించి రియాక్ట్ కావడానికి అప్పట్లో పెద్దగా ఇష్టపడలేదు.