రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించారు.ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు తీగల శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి, కేక్ కట్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమలో అలాగే రాజకీయంగా ప్రజలందరి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని పేర్కొన్నారు.తెలుగు ప్రజల గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన మహానీయులు ఎన్టీ రామారావు అని కొనియాడారు.
రాజకీయంగా బడుగు బలహీన వర్గాలకు రాజకీయ జన్మనిచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని, వారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని శేఖర్ గౌడ్ తెలిపారు.ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికి ప్రజల్లో ఉన్నాయని ఆయన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో దుమాల సత్యనారాయణ,ఆడెపు లక్ష్మీనారాయణ,నక్క రాజయ్య,ఇరుకుల్ల భాస్కర్, టి ఎన్ ఎస్ ఎఫ్ నాయకులు మోతె రాజిరెడ్డి,ఎస్కే బాష్మియా,ఎండి అయూబ్ ఖాన్ ఎండి సలీం,బింగి వెంకటేశం ,జెట్టి కొమురయ్య, రంగు శేషచలం గౌడ్,శ్యాగ ప్రశాంత్,ఆడెపు సత్తయ్య , ఎండి సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.







