రాజన్న సిరిసిల్ల జిల్లా: నిరంతరం విధులు నిర్వహించే పోలీస్ అధికారులు, సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద వహించవద్దని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు.పోలీస్ అధికారుల సిబ్బంది యెక్క ఆరోగ్య పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవతో తారక రామ హాస్పిటల్ సిరిసిల్ల వారి అధ్వర్యంలో ఆదివారం సిరిసిల్ల పట్టణంలోని వాసవి గార్డెన్స్ లో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
మెగా హెల్త్ క్యాంప్ కి ముఖ్య అతిధిగా హాజరై పోలీస్ సిబ్బందితో పాటు వైద్య పరీక్షలు చేపించుకున్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.ఈ వైద్య శిబిరంలో అధికారులకు,సిబ్బందికి బ్లడ్,షుగర్ పరిక్షలు, ఈ .సి .జి ,2 డీకో,బిఎమ్ ఐ (బాడీ మాస్ ఇండెక్స్ ) పరీక్షలు నిపుణులైన వైద్యులతో నిర్వహించడంతో పాటు, సిబ్బందికి వైద్యులు తగు సూచనలు, సలహాలను అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.పోలీస్ సిబ్బంది ఆరోగ్యమే మా ప్రథమ ప్రాధాన్యత అని పోలీసులు రాత్రింబవళ్లు పని చేయడంతో పాటు ప్రతిరోజు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, సిబ్బందికి మద్దతుగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు లు,యోగ, క్రీడల నిరహిస్తున్నామని అన్నారు.
ప్రతి ఒక్కరికీ ఆరోగ్యమే గొప్ప సంపద అని, పౌరులకు నిష్కళంకమైన సేవలను అందించడంలో ప్రతి పోలీసు జీవితంలో ఆరోగ్యం ఎలా కీలక పాత్ర పోషిస్తుందో కూడా వివరించారు.పోలీసులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని మరియు వైద్యుల సలహాలను పాటించాలని సిబ్బందిని ఆదేశించారు.
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నడక, వ్యాయామం, యోగ వంటివి మన దినచర్యలో భాగం చేసుకోవాలని.ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదని అన్నారు.
ప్రస్తుత సమాజంలో ఎంతో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో కలవని ప్రత్యేకంగా మనకు అందుబాటులో గల ఆరోగ్య భద్రత సద్వినియోగం చేసుకోవాలని 40 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు ప్రతి మూడు నెలలకు ఒకసారైనా మన ఆరోగ్యం కోసం డాక్టర్లను సంప్రదించి మందులు వాడే దానికంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని సూచించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు తారక రామ హాస్పిటల్ యాజమాన్యానికి, డాక్టర్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి,డాక్టర్ లు ,మహేష్ యురాలజీ,నరేష్ కుమార్ ఎం ఎస్ జనరల్ సర్జన్, రీనా శర్మిలి ఎండీ జనరల్ పిజిషియన్, సి.ఐ లు అనిల్ కుమార్,ఉపేందర్, మొగిలి, ఆర్.ఐ యాదగిరి, ఎస్.ఐ లు సిబ్బంది,హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.







