ముమైత్ ఖాన్.( Mumaith khan ) ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ కుర్ర కారు మొదలు పోగొట్టిన ఐటమ్ చిన్నది.
పదేళ్ల క్రితం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నది.బిగ్ బాస్ తెలుగులో( Bigg Boss ) సైతం పాల్గొని తెలుగు ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలి అనుకుంది.
హీరోయిన్ గా కూడా ఒకటి రెండు సినిమాలు తీసినప్పటికీ ఎందుకు ఆమె ప్రస్తుతం ఫామ్ లో లేదు.తెలుగువారు ఆమెను పూర్తిగా మరచిపోయారు.
ముమైత్ ఖాన్ నీ ఎక్కువగా పూరీ జగన్నాథ్( Puri Jagannath ) తన సినిమాల ద్వారా ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు.ఐటెం సాంగ్స్ తో మొదట కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కొన్ని చిత్రాల్లో నటించింది.
ప్రస్తుతం తెలుగులో ఆమె ఏ చిత్రంలో కూడా నటించడం లేదు.ఆమె ఎక్కడ ఉందో కూడా తెలియదు.ముంబైలో పుట్టి పెరిగిన ముమైత్ మళ్లీ తిరిగి తన ఊరికే వెళ్లిపోయిందని కొంతమంది అంటున్నారు.అయితే మొన్న ఆ మధ్యలో ఆలీతో సరదాగా( Alitho Saradaga ) అనే ప్రోగ్రాం లో పాల్గొని ఇంటర్వ్యూ ఇచ్చింది ముమైత్ ఖాన్ ఆ సందర్భంగా పెళ్లెప్పుడు చేసుకుంటావు అని ప్రశ్నించగా అందుకు ఘాటుగా సమాధానం ఇచ్చింది.
పెళ్లి చేసుకోవాలని నాకు ఉంది కానీ పెళ్లయిన తర్వాత భర్తను మారిపోతారని పిల్లలు కనాలని ఒత్తిడి చేస్తారని పైగా మోటివేషన్ ఎంకరేజ్మెంట్ లాంటివి దొరకవని మనం ఏం చేసినా అడ్డు చెప్పాలనే ప్రయత్నిస్తారని, ఏ విషయంలో నువ్వు సపోర్ట్ దొరకదు అంటూ చెప్పుకొచ్చింది.
అందుకే ఇంత వయసు వచ్చిన ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేకపోయానని పెళ్లికి జీవితానికి సంబంధం ఉండదని పెళ్లి చేసుకున్న తర్వాత తాము అనుకున్న విధంగా ఉండటం కుదరదు కాబట్టి పెళ్లి గురించి తాను ఆలోచించడం లేదు అంటూ కుండ బద్దలు కొట్టినట్టుగా సమాధానం చెప్పింది ముమైత్ ఖాన్.ఇక ముమైత్ ఖాన్ తో పాటు ఆమె చెల్లి కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆమె పెద్దగా క్లిక్ ఇవ్వలేదు.మరి ముమైత్ ఖాన్ మళ్లీ తెలుగులో నటించి బిజీ ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుందాం.