టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ తేజ (Teja) ఒకరు.ఈయన సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే.
ఇక తాజాగా తేజ అహింస ( Ahimsa ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా ద్వారా ఈయన దగ్గుబాటి వారసుడు అభిరామ్( Abhi Ram ) ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు.
ఈ సినిమా జూన్ రెండవ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రీరిలీజ్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమానికి హీరో రానా( Rana ) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ క్రమంలోనే మరోసారి తేజ హీరో రానాతో కలిసి మరొక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని తెలిపారు.ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం నేనే రాజు నేనే మంత్రి ( Nene Raju Nene Mantri ).కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal ) రానా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.ఇలా ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుందని తేజ వెల్లడించారు.ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేశారని తేజ ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్ కూడా తెలియజేశారు.

తన దర్శకత్వంలో రానా హీరోగా రాబోతున్న సినిమాకు రాక్షస రాజు ( Rakshasa Raju )అనే టైటిల్ ను పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.ఈ సినిమాతో 45 మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.ఆసక్తి ఉన్న వ్యక్తులు దీని కోసం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తనను సంప్రదించవచ్చని ఈ సందర్భంగా తేజ సినిమాలలోకి రావాలనుకున్న వారికి అవకాశం కూడా కల్పించారు.ఇక ఈ సినిమాలో రానా పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తోంది.
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తేజ ఈ సందర్భంగా వెల్లడించారు.







