ఇతిహాస గ్రంధం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”ఆదిపురుష్” (Adipurush).బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ వండర్ కోసం ఆడియెన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
ఎప్పుడెప్పుడు ప్రభాస్ (Prabhas) ను రాముడి పాత్రలో వెండితెర మీద చూస్తామా అని ఎదురు చూడని అభిమాని లేరు.
తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాను టి సిరీస్ సంస్థ, రిట్రో ఫైల్స్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మించారు.
ప్రభాస్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కృతి సీత పాత్రలో నటిస్తున్న విషయం విదితమే.అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తుండగా.
సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.

వచ్చే నెల గ్రాండ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుండి వరుసగా అప్డేట్ లను ఇస్తూ మరింత క్రేజ్ పెంచుతున్నారు.ఇదిలా ఉండగా ఇప్పటికే ఆంధ్రాలో తిరుపతి (Adipurush Pre-Release Event) వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.ఈ ఈవెంట్ లో అదిరిపోయే సర్ప్రైజ్ లను మేకర్స్ ప్లాన్ చేసినట్టు ఇప్పుడు గాసిప్ వస్తున్నాయి.
నెవర్ బిఫోర్ అనేలా ప్లానింగ్ రెడీ చేశారట.

మాములుగా అందరు చేస్తున్న రెగ్యురల్ ఫార్మాట్ లో కాకుండా విభిన్నంగా ఈ ఈవెంట్ లో చాలా స్పెషల్ ప్లానింగ్స్ ను ఏర్పాటు చేసారని.ఈ ఈవెంట్ కు వెళ్లిన వారికి మాత్రమే కాకుండా ఆన్లైన్ లో చూసే వారికీ కూడా థ్రిల్ చేసేలా ప్లానింగ్ చేస్తున్నట్టు టాక్.2 లక్షల మంది అభిమానుల సమక్షంలో ఈ ఈవెంట్ జరగనుంది.మరి ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ ఈవెంట్ ను ఎలా పూర్తి చేస్తారో వేచి చూడాలి.







