డైరెక్టర్ తేజ (Director Teja)ఎంతో మంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.ఈ క్రమంలోనే ఈయన తాజాగా దగ్గుబాటి వారసుడు అభిరామ్ (Abhi Ram) ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు.
అభిరామ్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అహింస(Ahimsa).ఈ సినిమా జూన్ రెండవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అభిరామ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన ఈ సినిమా విశేషాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా అభిరామ్ మాట్లాడుతూ…ఒకరోజు తేజ గారు కలిసి ఈ సినిమా కథ వినిపించారు కథ విన్నటువంటి నాన్న ఈ సినిమాతో తనని ఇండస్ట్రీకి లాంచ్ చేయడం సరైనదని భావించి ఈ సినిమాకి ఒప్పుకున్నారని తెలిపారు.ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తేజ గారు తనని అందరి ముందు మైక్ లో తిట్టారంటూ అభిరామ్ తెలిపారు.నీకు ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా నాకు అవసరం లేదు.ఆడియన్స్ కోసమే నేను ఈ సినిమా చేస్తున్నాను కాబట్టి ఫోకస్ పెట్టి నటించు అని అందరి ముందు తిట్టారు.

ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్ ను ఎత్తుకొని పరిగెత్తి సన్నివేశం షూట్ చేసే సమయంలో పొరపాటున కింద పడటంతో మోకాళ్ళకు బాగా దెబ్బలు తగిలాయని దాదాపు 6 నెలల పాటు రెస్ట్ తీసుకున్నానని అభిరామ్ తెలిపారు .ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత నాన్న చిన్నాన్నకు సినిమా చూపిస్తే కొన్ని చిన్న చిన్న మార్పులు తెలియజేశారు.ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో తనలో ఏదో తెలియని భయప మొదలైందని దాంతో రాత్రిపూట నిద్ర కూడా పట్టడం లేదు అంటూ ఈ సందర్భంగా అభిరామ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







