యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయ ప్రాంగణంలో శనివారం నాగుపాము హాల్ చెల్ చేసింది.మొదటి ఘాట్ రోడ్డు మధ్యలో సుమారు గంటన్నర పాటు పడగ విప్పి బుసలు కొట్టడంతో కొండపైకి వెళ్లే భారీ వాహనాలను పోలీసులు నిలిపివేశారు.
చివరికి ఎస్పీఎఫ్ సిబ్బంది పోలీసులు,దేవస్థానం సిబ్బంది కలసి పామును అక్కడి నుండి తరలించే ప్రయత్నం చేసినప్పటికి వారి ప్రయత్నాలు ఫలించలేదు.చివరికి నాగు పామే అక్కడి నుండి వెళ్ళిపోవడం అంతా ఊపిరిపీల్చుకున్నారు.







