రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలనికి చెందిన మస్కూరి రాజు సెల్ ఫోన్ 4 నెలల క్రితం ఎక్కడో పడిపోయిందని ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో గత నెల 22న ఫిర్యాదు చేశాడు.సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ యాప్ ద్వారా సెల్ ఫోను ను ఎల్లారెడ్డిపేట పోలీసులు సెల్ ఫోన్ దొరికిన వ్యక్తిని గుర్తించి సెల్ ఫోనును స్వాధీనం చేసుకుని
శనివారం ఎస్సై శేఖర్ బాధితుడు మస్కూరి రాజుకు కు అప్పగించారు.
ఎస్ఐ శేఖర్ మాట్లాడుతూ ఎవరైనా సెల్ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసినట్లయితే ఈ యాప్ ద్వారా గుర్తించి వారు పోగొట్టుకున్న ఫోన్లు గుర్తించి తిరిగి ఇవ్వబడుతుందని పేర్కొన్నారు.







