Keerthy Suresh Revathi: కీర్తి సురేష్ అక్క టాలెంట్ కు ఫిదా కావాల్సిందే.. ప్రేమ, కౌగిలింతలు పంపుతానంటూ?

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్( Keerthy Suresh ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె మొదట నేను శైలజ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

 Keerthy Suresh Sister Revathi Directional Debut-TeluguStop.com

మొదటి సినిమాతోనే యూత్ ని విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు మొదటి సినిమాతోనే విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది కీర్తి సురేష్.ఆ తరువాత తెలుగులో నేను శైలజ, నేను లోకల్, అజ్ఞాతవాసి, మహానటి, రంగ్ దే, సర్కారు వారి పాట వంటి సినిమాలలో నటించి మెప్పించింది.

Telugu Keerthy Suresh, Keerthysuresh, Revathi, Short, Tollywood-Movie

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇది ఇలా ఉంటే కీర్తి సురేష్ దసరా సినిమాలో నటించిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ అక్క రేవతికి( Revathi ) సంబంధించి ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.ఇప్పటివరకు లైమ్ లైట్లో లేని ఈ అమ్మాయి దర్శకురాలిగా పరిచయం కాబోతుండటం విశేషమే.

ఐతే ఆమె డైరెక్టర్‌గా మారుతోంది ఫీచర్ ఫిలింతో కాదు షార్ట్ ఫిలింతోనే.

Telugu Keerthy Suresh, Keerthysuresh, Revathi, Short, Tollywood-Movie

ఆ షార్ట్ ఫిలిం పేరు థ్యాంక్ యు.( Thank You Short Film ) కాగా తన సోదరి దర్శకత్వం వహిస్తున్న షార్ట్ ఫిలిం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కీర్తి సురేష్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.Thank U అనే టైటిల్లో U అక్షరాన్ని టీ కప్పులా చూపించారు.

అలాగే కింద రెండు జతల చెప్పులు కనిపిస్తున్నాయి.ఇదంతా చూస్తుంటే ఒక జంట టీ తాగుతూ కబుర్లు చెప్పుకునే క్రమంలో నడిచే లవ్ కథలా అనిపిస్తోంది.

దీని గురించి కీర్తి స్పందిస్తూ.ఈ స్వీట్ షార్ట్ ఫిల్మ్ థ్యాంక్ యు తో నా సోదరి దర్శకురాలిగా ఎట్టకేలకు అరంగేట్రం చేయడం చాలా సంతోషంగా ఉంది.

రేవతి నీకు బోలెడంత ప్రేమ కౌగిలింతలు పంపుతున్నా అని కామెంట్ చేసింది కీర్తి సురేష్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube