ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.135 స్థానాల్లో తిరుగులేని విజయం సాధించి ఏ పట్టి అండ లేకుండా అధికారాన్ని చేపట్టింది హస్తం పార్టీ.అయితే కాంగ్రెస్ ఈ స్థాయి విజయాన్ని బీజేపీ, జెడిఎస్ పార్టీలు అసలు ఊహించలేదనే చెప్పాలి.మొదటి నుంచి సర్వేలుగాని, విశ్లేషణలు గాని సంకీర్ణ ప్రభుత్వం రావచ్చనే సంకేతాలు ఇచ్చాయి.
దాంతో బీజేపీ, జెడిఎస్( JDS ) వంటి అధికారం తమదే అన్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చాయి.ఎందుకంటే హంగ్ ఏర్పడితే బీజేపీకి జెడిఎస్ మద్దతుతో ఈ రెండు పార్టీలు కలిసి అధికారాన్ని చేపట్టే అవకాశం ఉండేది.

ఆ రెండు పార్టీల వ్యూహం కూడా అదే.కానీ ఎన్నికల రిజల్ట్ తరువాత అంచనాలన్నీ తారుమారయ్యాయి.కాంగ్రెస్ ఏకంగా 135 స్థానాల్లో గెలవగా, బీజేపీ 66 స్థానాలు, జెడిఎస్ పార్టీ 19 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యాయి.దీంతో కాంగ్రెస్ ఏకపక్షంగా ప్రభుత్వాన్ని స్టాపించింది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరుపున సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.అయితే సిద్దరామయ్య ప్రభుత్వం ఏడాదికే కూలిపోతుందని జెడిఎస్ అధినేత కుమారస్వామి ( Kumara swamy )ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సిద్దరామయ్య ప్రభుత్వ భవిష్యత్ 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలపై ఆధారపడి ఉంటుందని చెబుతూ.కర్నాటకలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఐదేళ్ల కంటే ముందే రావచ్చనే విధంగా వ్యాఖ్యలు చేశారు కుమారస్వామి.

ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.2024 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ గెలిస్తే.కర్నాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం కూలుతుందనే విధంగా కుమారస్వామి వ్యాఖ్యలు ఉండడం గమనార్హం.కాగా దక్షిణాది రాష్ట్రాలలో ఎప్పటి నుంచో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ ఒక్క కర్నాటకలో మాత్రమే బలంగా ఉంది.
ఇప్పుడు ఆ రాష్ట్రంలో కూడా అధికారం కోల్పోయింది.దీంతో తిరిగి పట్టుకోసం బీజేపీ సిద్దరామయ్య ప్రభుత్వాన్ని కూల్చిన ఆశ్చర్యం లేదు.ఎందుకంటే చాలా రాష్ట్రాలలో బీజేపీ ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చి అధికారంలోకి వచ్చిన సంగతి విధితమే.అందుకే సిద్దరామయ్య( Siddaramaiah ) ప్రభుత్వ భవిష్యత్ వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఆధారపడి ఉందని కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం అనేది కొందరి వాదన.
మరి రాబోయే రోజుల్లో కర్నాటక రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి;.