సీనియర్ నటుడు నరేష్ , ప్రముఖ నటి పవిత్రా లోకేష్( Naresh Pavitra Lokesh ) హీరో హీరోయిన్లుగా.వనిత విజయ్ కుమార్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం మళ్ళీ పెళ్లి.
( Malli Pelli Movie ) ఎంఎస్ రాజు( Director MS Raju ) దర్శకత్వం వహించడం … ఈ సినిమాతో లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ విజయ కృష్ణ మూవీస్ సంస్థను పునః ప్రారంభించడంతో సినిమా పై ఆసక్తి పెరిగింది .ఇదే సమయంలో ఇది నరేష్ -పవిత్ర నిజజీవితానికి సంబందించిన కధ కావడం .టీజర్ , ట్రైలర్ లు ఆసక్తికరంగా ఉండటంతో సినిమా పై అంచనాలు పెరిగాయి .మరి ఈ సినిమా ఆ అంచనాలని అందుకుందా.విజయ కృష్ణ మూవీస్ సంస్థ ఈ సినిమాతో విజయాన్ని అందుకుందా లేదా అనేది రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
ముందుగా కధ విషయానికి వస్తే .మళ్ళీ పెళ్లిని సినిమా అనడం కంటే నరేష్, పవిత్రాల బయోపిక్ లేదా సెమీ బయోపిక్ అనడం కరెక్ట్ .నరేష్ జీవితంలో జరిగిన ఘటనలు, సంఘటనల సమాహారమే ఈ సినిమా కధ అని చెప్పవచ్చు .అయితే… సినిమాలో పేర్లు మార్చారు.నరేంద్రగా నరేష్, పార్వతిగా పవిత్రా లోకేష్ కనిపించారు.
మూడో భార్య రమ్యా రఘుపతి పాత్రలో వనితా విజయ్ కుమార్ నటించారు.నరేంద్ర అనుకోకుండా మూడు పెళ్లిళ్లు చేసుకుంటారు .అయితే ఏది కలసి రాదు .ముగ్గురుకి విడాకులు ఇస్తారు .అయితే మూడో భార్య విడాకుల వివాహం తేలకముందే .పార్వతి ప్రేమలో పడతాడు .పార్వతి – నరేంద్ర మధ్య అసలు ప్రేమ మొదలయింది .అయన భార్యతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిన కధ.

సినిమా విశ్లేషణ విషయానికి వస్తే .సినిమా ని ఓ ఆసక్తికర పాయింట్ తో మొదలు పెట్టిన విధానం బాగుంది .నరేష్, పవిత్రా లోకేష్ పరిచయం ప్రేమగా ఎలా మారింది అనే టాపిక్ నుంచి మా ఎలక్షన్స్, బెంగళూరు ఎపిసోడ్.మూడో భార్యను ఆయన కాలి మీద తన్నడం వరకు అన్నీ సినిమాలో చూపించారు.
అలాగే నరేష్ గురించే చెప్పే సన్నివేశాలు కాస్త శృతి మించినట్టు అనిపిస్తాయి .డైలాగుల్లో కొన్ని డబుల్ మీనింగ్స్ కూడా చోటు చేసుకున్నాయి.వెయ్యి కోట్ల ఆస్తి నరేష్ వెనుక ఉందని చెప్పకనే చెప్పారు.ముసలోడు అని కనికరించి పెళ్లి చేసుకుంటే అని ఓ డైలాగ్ చెప్పించడం కూడా విశేషం .పూర్తిగా నరేష్ సైడ్ తీసుకున్నట్లు కాకుండా కొన్ని సన్నివేశాల్లో ఆయన్ను నెగిటివ్ గా చూపించే ప్రయత్నం చేశారు.

నరేష్ జీవితంలో జరిగిన, జరుగుతున్న సంఘటనలని చాలా వరకు చూపించారు .రియల్ లైఫ్‌లో రమ్య రఘుపతి మీడియా ముందుకు వచ్చి.నరేష్ గురించి చెబుతున్నట్లుగానే.
సినిమాలోనూ కొని సన్నివేశాలు ఉండటం ఆసక్తి కలిగితస్తుంది .భార్యను ఎలా చూసుకోవాలో.భార్యకు ఎలా విలువ ఇవ్వాలో తెలియని ఒక మృగం అతను అని చెబుతున్న డైలాగ్ ఆకట్టుకుంటుంది.అయితే నరేష్ ని కొంత పాజిటివ్ గ చూపించే సన్నివేశాలు రియాలిటీకి దూరంగా ఉన్నాయి .అలాగే కొన్ని సన్నివేశాలు సినిమాటిక్ గ అనిపిస్తాయి .అలాగే ఒకే టాపిక్ చుట్టూ తిరగడం కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే .నరేష్ , పవిత్ర తమ జీవిత పాత్రల్లో ఒదిగిపోయారు.జయసుధ, శరత్ బాబు తమ పాత్రలకు తగ్గ నటనతో ఆకట్టుకున్నారు .అలాగే కీలక పాత్రలో నటించిన వనితా విజయ్ కుమార్ తమ పాత్రలో జీవించేసారు .ఇక అనన్య నాగళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి వంటి వారు తమ పాత్రలకు తగ్గ నటనతో మెప్పించారు.ఇక సాంకేతిక విషయాలకి వస్తే .సురేష్ బొబ్బిలి స్వరాలు ఒకే అనిపిస్తాయి.అరుల్ దేవ్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది .దర్శకుడు ఎమ్మెస్ రాజు తన దర్శకత్వ ప్రతిభతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు .అయితే కొన్ని సన్నివేశాలని మరింత ఆసక్తికరంగా తెరకెక్కిస్తే బాగుండేది .ఇక ఫోటో గ్రఫీ బాగుంది .నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.ఓవరాల్ గా చుస్తే .నరేష్ రిలాల్ స్టోరీ అనే ఆసక్తి కలిగిన .అంతే ఆసక్తిగా సినిమా లేదని చెప్పవచ్చు .అయితే ఓ సారి టైం పాస్ కోసం చూడొచ్చు .








