ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేర్లలో సినీ నటి కరాటే కళ్యాణి( karate kalyani ) పేరు కూడా ఒకటి.ఈమె సినిమాల ద్వారా కంటే ఈ మధ్యకాలంలో వివాదాల ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.
ఇది ఇలా ఉంటే కరాటే కళ్యాణి తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే.తాజాగా ఇదే విషయంపై స్పందించింది.
తాను ఎన్టీఆర్ విగ్రహం గురించి మాట్లాడినందుకే తనను కావాలనే మా అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేశారని ఆమె ఆరోపించింది.
షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత న్యాయవాది ద్వారా వివరణ ఇచ్చానని, తాను వేసిన పిటిషన్‌కు మా అసోసియేషన్‌కు( maa association ) ఎటువంటి సంబంధం లేదని ఆమె తెలిపింది.
సస్పెండ్ చేయడం పట్ల తాను న్యాయపోరాటం చేయనున్నట్లు వెల్లడించింది.తాను ఎన్టీఆర్‌కి వీరాభిమానిని అని అయితే శ్రీకృష్ణుడి రూపంలో విగ్రహం పెట్టడాన్ని మాత్రం తాను వ్యతిరేకిస్తున్నట్లు మరోసారి తెలిపింది కళ్యాణి.
తాను శ్రీకృష్ణుడి పై అభిమానంతోనే పిటీషన్ వేశానని, అందుకు తనకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు తెలిపింది.కాగా టాలీవుడ్ నందమూరి తారక రామారావు శతజయంతి( Sr NTR Shathajayanthi ) ఉత్సవాల్లో సందర్భంగా ఖమ్మంలో 54 అడుగుల ఎత్తు గల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
తెలంగాణ రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు.అంతా బాగానే ఉంది కానీ కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వీల్లేదంటూ కళ్యాణి మీడియా ముందుకు వచ్చి అభ్యంతరం వ్యక్తం చేశారు.దీంతో అప్పటినుంచి అసలు వివాదం మొదలవడంతో కోర్టు కూడా విగ్రహ ఆవిష్కరణ జరగడానికి వీల్లేదు అంటూ తీర్పుని ఇచ్చింది.ఆ తర్వాత విగ్రహంలో కొన్ని మార్పులు చేయమని చెప్పడంతో ఆ విగ్రహానికి ఉన్న నెమలి అలాగే చేతిలో ఫ్లూటు తీసి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.