కార్లతో నీళ్లు విసిరికొట్టడమేమిటి అని అనుకుంటున్నారా? సోషల్ మీడియా( Social media )లో వైరల్ అయ్యే ఈ వీడియో చూస్తే మీకు అర్ధం అవుతుంది.అలా ఎందుకు అనాల్సి వచ్చిందో అని.
సాధారణంగా నిత్యం సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.అయితే అందులో యే కొన్నో జనాలకి బాగా నచ్చుతాయి.
ఇక కొన్ని వీడియోలు ఎందుకు నచ్చుతాయో అర్ధం కాదు.అయితే ప్రస్తుతం వైరల్ అయిన వీడియో మాత్రం జనాలకి నచ్చడంతో ఓ పరమార్ధం వుంది.

సాధారణంగా రోడ్డుపైన గుంటల్లో మురికి నీరు వున్నపుడు ఎవరన్నా కారు( Car )తో అటువైపుగా వెళ్ళినపుడు మనల్ని చూస్తూనే కారుని దాంట్లోనుండి పోనిచ్చి ఆ నీటిని మనపై చల్లే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎక్కడో కాలుతుంది కదూ.పోనీ పొరపాటున ఆ వాహనదారుడు అలా చేసినా మనం చూస్తూ ఊరుకోము.నానా రచ్చ చేస్తాము.కానీ ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం ముగ్గురు ఔత్సాహికులు మాత్రం కోరి రోడ్డుపైన మురికినీటిని తమపైన చల్లమని దారినపోయిన వాహనదారులని కోరుతున్నారు.

ఇక ఈ వీడియో పాతదే అయినప్పటికీ లేటుగా మన దేశీయ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) కంట పడిందేమో.ఈ వీడియోకి ‘ప్రతి కూలత లేదా అవకాశం? ఇదంతా మైండ్ మరియు యాటిట్యూడ్ కి సంబంధించిన అంశం’ అనే క్యాప్షన్ ఇస్తూ ఆనంద్ మహీంద్రా షేర్ చేయగా ఆ వీడియో మరలా వైరల్ అవుతోంది.అంటే ఏదైనా పాజిటివ్‌గా ఆలోచించడం.ఏ సమయాన్నైనా సంతోషంగా ఆస్వాదించడం అనేది నిజంగానే మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పకనే చెప్పారు.సింపుల్ గా చెప్పాలంటే దేన్నైనా ఎంచుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది అని అర్ధం.ఇంకా సంతోషంగా ఉండేవారు ఇలాగే ప్రతిక్షణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు.







