టాలీవుడ్ ( Tollywood )లో విభిన్నమైన కథాంశాలతో విభిన్నమైన ఆలోచనలతో సినిమాలు చేసే ఇద్దరు ముగ్గురు హీరోలలో ఒకడు జేడీ చక్రవర్తి.రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జేడీ చక్రవర్తి( JD Chakraborty ) అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరో గా నటించాడు.
కేవలం ఒక్క హీరో గా మాత్రమే కాదు, దర్శకుడిగా , రచయితగా, స్క్రీన్ ప్లే రైటర్ గా మరియు గాయకుడిగా ఇలా అన్నీ విభాగాలలో జేడీ చక్రవర్తి ఎంతో గొప్పగా రాణించాడు.ఈయన నటించిన కొన్ని చిత్రాలు ‘మనీ మనీ’ , ‘గులాబీ’, ‘బొంబాయి ప్రియుడు’, ‘ఎగిరే పావురమా’ , ‘దెయ్యం’ ఇలా ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ ని ఆ రోజుల్లో ఒక ఊపు ఊపాయి.
కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, బాలీవుడ్( Bollywood ) లో కూడా ఈయన ఎన్నో సంచలనాత్మక చిత్రాలలో హీరోగా నటించాడు.అందులో సత్య అనే సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు.
ఈ చిత్రం తర్వాత ఆయన బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించాడు కానీ ఆశించిన స్థాయిలో విజయం సాధించాడు.కొన్నాళ్ల తర్వాత ఆయన తెలుగు లో జగపతి బాబు ని హీరో గా పెట్టి ‘హోమం’( homam ) అనే సినిమాకి దర్శకత్వం వహించాడు.ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ అవ్వడం తో ,డైరెక్టర్ గా పలు సినిమాలు తీసాడు.ఇది ఇలా ఉండగా జేడీ చక్రవర్తి మేకింగ్ స్టైల్ తన గురువు రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) మేకింగ్ స్టైల్ తో పోలి ఉంటుంది.
ఆయన లాగానే ఆలోచిస్తాడు, ఆయన నచ్చేవే నచ్చుతాడు.అప్పట్లో రామ్ గోపాల్ వర్మ నేను జయసుధ ని ప్రేమించాను అని ఇంటర్వ్యూస్ లో చెప్పుకునే వాడు.జేడీ చక్రవర్తి కూడా ఇంటర్వ్యూస్ లో అలాగే చెప్పుకునే వాడు.రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మీరు మీ గురువు రామ్ గోపాల్ వర్మ గారిలాగానే ఆలోచిస్తున్నారు, మీ ఇష్టాయిష్టాలు కూడా ఒకేలా ఉన్నాయి , అంత దగ్గర మీరు ఆయనకీ ఎలా కనెక్ట్ అయ్యారు ,మీకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి కదా అని అడుగుతుంది.
దానికి జేడీ చక్రవర్తి సమాధానం చెప్తూ ‘ఈ ప్రపంచం లో జయసుధ గారిని, శ్రీదేవి గారిని మేమిద్దరం మాత్రమే ఇష్టపడుతున్నాము, మిగతావాళ్ళు అసలు ఇష్టపడడం లేదు కదా.?, ఏమి ప్రశ్నలు అడుగుతారండీ, రామ్ గోపాల్ వర్మ ఇష్టాలతో నా ఇష్టాలు కలవకూడదా, ఎక్కడైనా ఏమైనా రూల్ రాసిపెట్టి ఉందా’ అని అడుగుతాడు.ఆ తర్వాత యాంకర్ మరో ప్రశ్న అడుగుతూ ‘జేడీ చక్రవర్తి అంటే హీరో అనాలా , డైరెక్టర్ అనాలా,సింగర్ అని పిలవాలా, లేదా నిర్మాత అని పిలవాలా?’ అంటూ ఆమె అడిగిన ప్రశ్న కి జేడీ సమాధానం చెప్తూ ‘ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఒక తల్లి కి కూతురు గా ఉన్నారు, పిల్లలకు తల్లి గా ఉన్నారు, భర్త కి భార్య గా ఉన్నారు, మీరు ఒక్కరే ఇన్ని పాత్రలు పోషిచినప్పుడు నేను పోషించడం లో ఆశ్చర్యం ఏముంది?’ అని అంటాడు.జేడీ చక్రవర్తి ఇచ్చిన సమాధానాలకు యాంకర్ దండం పెట్టి నవ్వేస్తుంది.