ఈరోజు విడుదలైన తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ఫలితాలలో ఏన్కూర్ మండలం( Enkoor Mandal ) రాఘవాపురం గ్రామానికి చెందిన విద్యార్థిని రాయపాటి ఉషశ్రీ, వెంకటేశ్వర్లు,కవిత దంపతుల ద్వితీయ కుమార్తె రాష్ట్రస్తాయి లో 2207 ర్యాంకు, ఇంటర్మీడియట్ లో 992 మార్కులు సాధించినందుకు ఖమ్మం శ్రీచైతన్య జూనియర్ కళాశాల( Sri Chaitanya ) మానేజ్మెంట్ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ జెఈఈ మెయిన్స్ లో 93.98 పర్సoటైజ్ తో అడ్వాడ్ కు సెలెక్ట్ అయిన రాయపాటి ఉషశ్రీ( Rayapati Usha sree ) టాప్ ఐఐటి కళాశాలలో సీటు సాధించాలని కోరారు.
రైతు కుటుంబం లో జన్మించి మట్టిలో మాణిక్యము అని నిరూపించిన ఉషశ్రీ కి రాఘవాపురం గ్రామస్తులు, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.