చిక్కుడు( Broad Beans ) జాతి మొక్కలకు సెర్కోస్పోరా( Cercospora Leaf Spots ) ఆకుపచ్చ తెగుల బెడద చాలా ఎక్కువ.ఈ తెగులను సకాలంలో గుర్తించి అరికట్టి తేనే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది.
లేదంటే ఈ తెగుల ద్వారా భారీగా ఊహించని నష్టం వాటిల్లుతుంది.కాబట్టి ముందుగా ఈ ఆకుమచ్చ తెగుళ్లను ఎలా గుర్తించాలో చూద్దాం.
చిక్కుడు జాతి మొక్కల ఆకులపై ఎర్రటి గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా కొమ్మలకు, కాయలకు వ్యాపించడంతో ఆకులు రాలిపోతాయి.పంట విత్తిన తర్వాత మూడు నుంచి ఐదు వారాల మధ్యలో మొక్కల యొక్క లేత ఆకులపై ఈ గోధుమ రంగు రింగు మచ్చలు ఏర్పడడం ప్రారంభం అవుతాయి.
తర్వాత ఈ తెగుళ్ల ఉధృతి పెరిగి ముదురు గోధుమ రంగులోకి మారి చుట్టుపక్కల ఉండే మొక్కలకు వ్యాపిస్తాయి.
వీటిని సకాలంలో గుర్తించి నివారించకపోతే పూత, పిందె, కాయ దశలలో పంట ఉన్నప్పుడు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.ఈ తెగులు గాలి ద్వారా, వీటి ద్వారా మొక్కల యొక్క కింది భాగాలకు సోకుతుంది.ఈ తెగుల శిలీంద్రాలు దాదాపుగా రెండు సంవత్సరాల పాటు మట్టిలో జీవించే అవకాశం ఉంది.
వేరు వ్యవస్థ ద్వారా భూమి లోపల ఈ తెగులు ప్రయాణిస్తూ ఉంటాయి.
కాబట్టి ఈ తెగులను నివారించడం కోసం సేంద్రీయ పద్ధతులను అనుసరించాలి.వేప నూనె ను పంటకు పిచికారి చేయడం వల్ల ఆరోగ్యమైన పంటను పొందవచ్చు.ఒకవేళ రసాయన పద్ధతులను అనుసరించాలి అనుకుంటే తక్కువ మొత్తంలో రసాయన ఎరువులను వాడాలి.
దనుకొప్ 50 % డబ్ల్యూ పి లేదంటే మనికొప్ లేదంటే కొప్పర్- ఎస్ లలో ఏదో ఒక దానిని ఉపయోగించి ఈ తెగులను నివారించాలి.ఈ తెగులను సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపడితే నాణ్యమైన అధిక దిగుబడి పొందవచ్చు.