ఓటిటీ డీల్ లాక్ చేసుకున్న టైగర్ నాగేశ్వరరావు.. భారీ ధరకు స్ట్రీమింగ్ రైట్స్!

మాస్ మహారాజా రవితేజ( Ravi Teja ) నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు.

( Tiger Nageswara Rao ) నూతన డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు బాగానే ఏర్పడగా నిన్న రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ గ్లింప్స్ తో అంచనాలు డబుల్ అయ్యాయి.

ఒకేసారి ఐదుగురు స్టార్ హీరోలతో ఐదు భాషల్లో ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.నిజ జీవిత సంఘటనలతో 1970ల కాలంలో గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ టీజర్ కు క్రేజీ రెస్పాన్స్ లభించింది.

5 భాషల్లో ఆడియెన్స్ ను మంచి రెస్పాన్స్ లభించింది.ఇక నిర్మాతలు కూడా భారీ హంగులతో ఎక్కడ తగ్గకుండా అత్యుత్తమ ప్రామాణిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ హక్కులను ప్రముఖ ఓటిటీ సంస్థ కొనుగోలు చేసినట్టు టాక్.అమెజాన్ ప్రైమ్ వీడియో( Amazon Prime Video ) వారు భారీ ధరతో ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను తీసుకున్నట్టు టాక్ వస్తుంది.త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

Advertisement

నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తున్నారు.

అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జిషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.టైగర్ నాగేశ్వరరావు సినిమాను అక్టోబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.దీంతో అప్పటికి ఈ సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ చేసి భారీ ఓపెనింగ్స్ కు ప్లాన్ చేసుకుంటున్నట్టు టాక్.

మరి ఈ అవైటెడ్ సినిమా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు