బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ( Priyanka Chopra ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలలో( Hollywood ) నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ గతంలో తనకు విధులను చేదు అనుభవాలు వ్యక్తిగత విషయాల గురించి పంచుకుంటోంది ప్రియాంక చోప్రా.ఇప్పటికే కొన్నిసార్లు తనకు గతంలో ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.
కెరియర్ తొలి రోజుల్లో చాలా మంది ఆమె రంగుపై విమర్శలు గుప్పించారని ఆమె తెలిపింది.తాజాగా ప్రియాంక చోప్రా మాట్లాడుతూ ఒక బాలీవుడ్ దర్శకుడు( Bollywood Director ) గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.నేను అప్పుడే బాలీవుడ్ లో అడుగుపెట్టాను.అదే సమయంలో ఒక సినిమాకి కూడా అంగీకరించాను.ఆ సినిమా షూటింగ్ ప్రారంభమైన కొద్దీ రోజులకు డ్యాన్స్ చేయాల్సి వచ్చింది.
ఈ సమయంలో ఆ సినిమా డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి డ్యాన్స్ చేసేటప్పుడు నా లోదుస్తులన్నీ తీసేయాలి అన్నాడు.అండర్ వేర్ చూపించమని అడిగితే నాకు చాలా కోపం వచ్చింది.
అలానే ఏం చేయాలో అర్థం కాక చాలా సమయంలో పాటు ఒంటరిగా ఉన్నాను.చివరి వరకు కూడా డైరెక్టర్ చెప్పిన దానికి నేను ఒప్పుకోలేదు.ఆ మరుసటి రోజే ఆ ప్రాజెక్ట్ నుంచి నేను తప్పుకున్నాను అని చెప్పు కొచ్చింది ప్రియాంక చోప్రా.అలా మాట్లాడిన వ్యక్తి సినిమాలో నాకు నటించడం ఇష్టం లేదు అని తెలిపింది ప్రియాంక చోప్రా.
కాగా ప్రియాంక అమెరికన్ పాప్ సింగర్ అయిన నిక్ జోనస్ ని( Nick Jonas ) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఈ దంపతులకు ఒక పాప కూడా ఉంది.