సినీ ఇండస్ట్రీకి ఎంతోమంది నటులు వస్తుంటారు పోతూ ఉంటారు.ఇక మరి కొంతమంది మధ్యలోనే లోకాన్ని కూడా వదిలేసిన వాళ్ళు ఉన్నారు.
అందులో ఇప్పటికీ మర్చిపోని నటుడుగా ఉదయ్ కిరణ్( Uday Kiran ) తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచాడు.ఆయన ఈ లోకానికి దూరమై చాలా ఏళ్ళు అయినప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులు మాత్రం ఆయనను ఇప్పటికీ మరువలేక పోతున్నారు.
ఎందుకంటే ఉదయ్ కిరణ్ తెలుగు ప్రేక్షకులతో అంత మంచి అభిమానం సంపాదించుకున్నాడు కాబట్టి.తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఉదయ్ కిరణ్.
ఎక్కువగా ప్రేమ కథలలోనే నటించాడు.అంతేకాకుండా లవర్ బాయ్( Lover boy ) గా కూడా నిలిచాడు.
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన సొంత టాలెంట్ తో స్టార్ హీరో హోదాను అందుకున్నాడు.ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.

చిత్రం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవ్వగా.ఇక ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు.ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే( Nuvve Nuvve, Manasantha nuvve movies ) వంటి సినిమాలలో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకొని ఉత్తమ నటుడు అవార్డు కూడా అందుకున్నాడు.అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.
అలా కొన్ని సినిమాలలో నటించిన తర్వాత ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.అవకాశాలు కూడా అంతగా అందుకోలేకపోయాడు.
వాటిని తట్టుకోలేక 2014లో ఆత్మహత్య చేసుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు.అయితే ఈయనకు ఈ పరిస్థితి రావడానికి కారణం చిరంజీవి ఫ్యామిలీ అని గతంలో జోరుగా వార్తలైతే వచ్చాయి.
కానీ ఏ రోజు కూడా చిరంజీవి ఫ్యామిలీ ఈ విషయం గురించి స్పందించలేదు.
ఆయన ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కున్నాడు.
ఆయనకు అవకాశాలు ఇవ్వలేదు అని అంటున్నారు కానీ.అసలు ఆయనకు ఎందుకు అవకాశాలు రాలేవు.
ఎవరి వల్ల అలా అయ్యాడు అనే విషయం చూస్తే చిరంజీవి ఫ్యామిలీ అని అంటున్నారు.అదేంటంటే ఉదయ్ కిరణ్ మంచి హోదాలో ఉన్న సమయంలో చిరంజీవి తన కూతురు సుష్మితను( Sushmita ) ఉదయ్ కిరణ్ కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడట.

కానీ కొన్ని కారణాల వల్ల ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని తెలిసింది.అది ఏ కారణం వల్ల ఆగిపోయిందో అనే విషయం మాత్రం బయటపడలేదు.అయితే ఆ పెళ్లి క్యాన్సిల్ తర్వాత ఉదయ్ కిరణ్ కనీసం మీడియా ముందుకు వచ్చి తను ఏ తప్పు చేయలేదని చెప్పి ఉంటే అప్పుడు ఆయనకు ఆ పరిస్థితి రాకపోయేదేమో అని అంటున్నారు.
ఆయన బయటికి వచ్చి ఆ విషయం చెప్పకపోవడం వల్లే తప్పు మొత్తం ఆయన మీద వేసేశారు.
దీంతో ఆయనకు ఇండస్ట్రీలో చెడ్డ పేరు వచ్చింది.డైరెక్టర్లు సైతం సినిమాలు ఇవ్వకుండా మానేశారు.
ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కున్నాడు.ఇక అవన్నీ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని తెలుగు ప్రేక్షకులను కన్నీటిలో ముంచాడు.
ఆరోజే ఆ విషయం చెప్పినట్లయితే ఇప్పుడు ఆయన కూడా బ్రతికుండి పాన్ ఇండియా స్టార్ గా ఉండేవాడేమో అని అంటున్నారు ఆయన అభిమానులు.







