ఈ విధంగా షాంపూ చేసుకుంటే పురుషులకు బట్టతల భయమే అక్కర్లేదు.. తెలుసా?

బట్టతల.( Baldness ) పురుషులను భయపెట్టే అతి పెద్ద భూతం.

 Shampooing In This Way Will Prevent Baldness Details! Baldness, Shampooing, Late-TeluguStop.com

వయసు పైబ‌డిన తర్వాత బట్టతల వచ్చిన పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది పాతిక, ముప్పై ఏళ్లకే బట్టతల బారిన పడుతున్నారు.

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని పని చేయడం, మద్యపానం, ధూమపానం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, పెరిగిన కాలుష్యం తదితర కారణాల వల్ల చిన్న వ‌య‌సులోనే బట్టతల సమస్యకు గురవుతున్నారు.దీని కారణంగా పురుషులు మానసికంగా కృంగిపోతుంటారు.

అందులోనూ పెళ్లి కాని వారు అయితే ఇంకా ఎక్కువ మదన పడుతుంటారు.అయితే బట్టతల వచ్చాక బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే పద్ధతిలో షాంపూ ( Shampoo ) చేసుకుంటే పురుషులకు బట్టతల భయమే అక్కర్లేదు.మరి ఇంకెందుకు ఆలస్యం బట్టతలకు దూరంగా ఉండాలంటే ఎలా షాంపూ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Aloevera, Baldness, Care, Care Tips, Fall, Latest, Regular Shampoo, Thick

ముందుగా ఒక గ్లాసు బియ్యం కడిగిన వాటర్ ను( Rice Water ) తీసుకోవాలి.ఈ వాటర్ లో ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.అవి జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఇప్పుడు ఈ బియ్యం కడిగిన వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloevera ) మరియు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు రెగ్యులర్ షాంపూను వేసి బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ వాటర్ ని యూస్ చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి.

Telugu Aloevera, Baldness, Care, Care Tips, Fall, Latest, Regular Shampoo, Thick

వారానికి రెండు సార్లు ఈ విధంగా తలస్నానం చేస్తే బట్టతల వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది.అలాగే హెయిర్ ఫాల్ తగ్గు ముఖం పడుతుంది.జుట్టు కుదుళ్లు దృఢంగా మారతాయి.

హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

చుండ్రు సమస్య ఉంటే దూరం అవుతుంది.మరియు హెయిర్ డ్యామేజ్ సైతం కంట్రోల్ అవుతుంది.

కాబట్టి బట్టతల సమస్యకు దూరంగా ఉండాలని భావించే పురుషులు తప్పకుండా ఇప్పుడు చెప్పిన విధంగా షాంపూ చేసుకునేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube