వివిధ దేశాల్లో రీమేక్ అవుతున్న సౌత్ సినిమా..?

మన వాళ్ళు చాలా సినిమాలు అక్కడ ఇక్కడ నుంచి రీమేక్ చేస్తూ ఉంటారు కానీ ఒకప్పుడు అక్కడి సినిమాలు చూసి మనం సినిమాలు తీసుకొస్తుంటే…వాళ్లే ఇప్పుడు మన సినిమా ని అక్కడ రీమేక్ చేస్తున్నారు.అక్కడి నుండి మనం తీసుకొస్తుంటే.

 South Movie Being Remade In Different Countries, Drushyam , South Movie, Jeeto-TeluguStop.com

వాళ్లే ఇప్పుడు మన సినిమా తీసుకెళ్తున్నారు.

ప్రపంచంలో బెస్ట్‌ థ్రిల్లర్‌ సినిమాలు అంటే కొరియన్‌ సినిమాలు( Korean movies ) అని చెబుతుంటారు.

 South Movie Being Remade In Different Countries, Drushyam , South Movie, Jeeto-TeluguStop.com

మన దర్శకులు అక్కడి కథలను నేరుగా, స్ఫూర్తి పేరుతోనే ఇక్కడకు తీసుకొచ్చారు.వాటిలో చాలా వాటికి మనం మంచి మార్కులేసి, విజయాలు కూడా అందించాం.అలాంటి కొరియన్‌ ఇండస్ట్రీ మన సినిమాను తీసుకెళ్తోంది అంటే పెద్ద విషయమే కదా.ఇంత మెల్లగా చెబుతారేంటి చాలా పెద్ద విషయం అంటారా? అయితే ఓకే.మన దేశంలో ఇటీవల కాలంలో తెరకెక్కిన బెస్ట్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ అంటే ‘దృశ్యం’( Drushyam ) అని చెప్పాలి.

Telugu Drushyam, Jeetoo Joseph, Kim Ji Won, Kang Ho, Remade-Movie

ఇప్పుడు ఆ సినిమాలే అక్కడకు వెళ్తున్నాయి.మలయాళంలో జీతూ జోసెఫ్‌( Jeetoo Joseph ) తెరకెక్కించిన థ్రిల్లర్‌ అద్భుతం ‘దృశ్యం’.మోహన్‌లాల్‌తో కలసి ఆయన చేసిన ఆ సినిమా ఎంతగా నచ్చేసిందంటే దేశంలో చాలా భాషల్లో ఆ సినిమాను రీమేక్‌ చేశారు.

అలా మలయాళ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఘనవిజయం సాధించింది ‘దృశ్యం’.ఇప్పుడు ఈ సినిమాను దక్షిణ కొరియాకు చెందిన ఆంథాలజీ స్టూడియోస్‌తో( Anthology Studios ) కలిసి, పనోరమా స్టూడియోస్‌ కొరియన్‌ భాషలో రీమేక్‌ చేయనుంది.

Telugu Drushyam, Jeetoo Joseph, Kim Ji Won, Kang Ho, Remade-Movie

మేరకు సినిమా వివరాల్ని ఇటీవల సినిమా వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.‘దృశ్యం’ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలు, రాబోయే మూడో సినిమా కూడా కొరియన్‌ భాషలో రీమేక్‌ అవుతుందని సమాచారం.కొరియన్‌ ‘దృశ్యం’లో ‘పారసైట్‌’ సినిమా ఫేం సాంగ్‌ కాంగ్‌ హో కథానాయకుడిగా నటిస్తున్నాడు.‘కోబ్‌ వెబ్‌’ దర్శకుడు కిమ్‌ జీ వోన్‌( Kim Ji Won ) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని సమాచారం.

మిగిలిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని టీమ్‌ తెలిపింది.అయితే ఈ సినిమాను (Drishyam) మలయాళం నుండి కాకుండా హిందీ నుండి తీసుకెళ్తున్నట్లు చెబుతున్నారు.పనోరమా స్టూడియోస్‌ అజయ్‌ దేవగణ్‌కు చెందినదనే విషయం మీకు తెలిసిందే.ఈ క్రమంలో టీమ్‌ కూడా హిందీ సినిమా ప్రపంచవ్యాప్తం అవుతోంది అని ప్రకటించారు.

దీంతో మూలం నుండి కాకుండా హిందీ నుండి సినిమా తీసుకెళ్లడం ఏంటో అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube