న్యూస్ రౌండప్ టాప్ 20

1.సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదల

సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలను ఈరోజు యూపీఎస్సీ విడుదల చేసింది.మొత్తం 933 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ర్యాంకులను వెల్లడించింది.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gol-TeluguStop.com

2.అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్

Telugu Sarath Babu, Chandrayan, Cm Kcr, Dimple Hayathi, Mlakotam, Telangana, Tel

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఈనెల 25న విచారించాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది.

3.తిరుమల భద్రత పై టీటీడీ దృష్టి

తిరుమల భద్రత పై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక దృష్టి పెట్టింది.ఇటీవల జరిగిన ఘటన నేపథ్యంలో నిఘా మరింత బలోపేతం చేయాలని టిటిడి నిర్ణయించింది.కేంద్ర ఐబి, ఇంటిలిజెన్స్ అధికారులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.

4.చెన్నైలో శరత్ బాబు అంత్యక్రియలు

Telugu Sarath Babu, Chandrayan, Cm Kcr, Dimple Hayathi, Mlakotam, Telangana, Tel

టాలీవుడ్ నటుడు శరత్ బాబు అంత్యక్రియలను నేడు చెన్నైలో నిర్వహించనున్నారు.

5.ఎమ్మెల్యే గిరిధర్ కు జగన్ పరామర్శ

ఎమ్మెల్యే మద్దాలి ఆయన కుటుంబ సభ్యులను ఏపీ సీఎం జగన్ పరామర్శించారు .ఎమ్మెల్యే గిరిధర్ తల్లి శివపార్వతి మరణించడంతో జగన్  ఆమె చిత్రపటానికి నివాళులర్పించి ఎమ్మెల్యేను ఓదార్చరు.

6.జగన్ కు పోలీసు అధికారుల సంఘం కృతజ్ఞతలు

Telugu Sarath Babu, Chandrayan, Cm Kcr, Dimple Hayathi, Mlakotam, Telangana, Tel

ఇటీవల పోలీసులు ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు 554 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.ఈ సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ ను కలిసిన పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

7.శరత్ బాబు కుటుంబ సభ్యులకు జగన్ సానుభూతి

సీనియర్ నటుడు శరత్ బాబు మృతి చెందడంపై ఏపీ సీఎం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

8.నేటి నుంచి నోట్ల మార్పిడి

Telugu Sarath Babu, Chandrayan, Cm Kcr, Dimple Hayathi, Mlakotam, Telangana, Tel

2000 కరెన్సీ నోటును చలమణి నుంచి పూర్తిగా ఉపసంహరిస్తున్నట్లు ఆర్బిఐ ప్రకటించిన నేపథ్యంలో వీటిని ఈరోజు నుంచి బ్యాంకులో మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు.బ్యాంకులో ఒక టర్మ్ లో 20 వేల వరకు మార్చుకునే అవకాశం కల్పించారు.

9.తెలంగాణ దశాబ్ది ఉత్సవాల లోగో ఆవిష్కరణ

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల లోగో ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.

10.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కామెంట్స్

Telugu Sarath Babu, Chandrayan, Cm Kcr, Dimple Hayathi, Mlakotam, Telangana, Tel

ఇకపై హెచ్చరికలు లేకుండా గెరిల్లా తరహా ఉద్యమాలు చేపడతామని వైసిపి బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

11.అవినాష్ రెడ్డి వ్యవహారంపై సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.సిబిఐ విచారణతో ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదని సజ్జల వ్యాఖ్యనించారు.

12.ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌస్ అరెస్ట్

Telugu Sarath Babu, Chandrayan, Cm Kcr, Dimple Hayathi, Mlakotam, Telangana, Tel

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.గాంధీనగర్ లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నేడు నిరసన ఉన్నట్లు ఎమ్మెల్యే ప్రకటించడంతో ముందస్తుగా అయినను అరెస్ట్ చేశారు.

13.నేడు రేపు ఓ మోస్తారు వర్షాలు

తెలంగాణలో మంగళ బుధవారాల్లో కొన్ని జిల్లాలు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

14.రేషన్ డీలర్లతో మంత్రి గంగుల చర్చలు సఫలం

Telugu Sarath Babu, Chandrayan, Cm Kcr, Dimple Hayathi, Mlakotam, Telangana, Tel

వచ్చే నెల ఐదు నుంచి నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నట్లు రేషన్ డీలర్ల ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించింది.ఈ మేరకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో జరిపిన చర్చలు ఫలించాయని రేషన్ డీలర్ల సమైక్య ప్రకటించింది.

15.మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : కేసీఆర్

మైనారిటీల అభివృద్ధి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.

16.యాదాద్రి సంస్కృత పాఠశాలలో ప్రవేశాలు

Telugu Sarath Babu, Chandrayan, Cm Kcr, Dimple Hayathi, Mlakotam, Telangana, Tel

యాదగిరిగుట్ట విద్యాపీఠం 2022 -23 విద్యా సంవత్సరానికి సంస్కృత కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తుంది.

17.చంద్రయాన్ 3 ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న చంద్రయాన్ 3 ప్రయోగాన్ని జులై 12న నిర్వహించనుంది.

18.చేప ప్రసాదం పంపిణీ

Telugu Sarath Babu, Chandrayan, Cm Kcr, Dimple Hayathi, Mlakotam, Telangana, Tel

జూన్ 9న చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

19.హీరోయిన్ డింపుల్ హైతి పై క్రిమినల్ కేసు

హీరోయిన్ డింపుల్ హైతి పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.ఓ ఐపీఎస్ అధికారికి చెందిన కారును ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతో పాటు , పార్కింగ్ స్థలంలో అడ్డంకులు కలిగిస్తున్న టాలీవుడ్ హీరోయిన్ తో పాటు,  ఆమె స్నేహితుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Sarath Babu, Chandrayan, Cm Kcr, Dimple Hayathi, Mlakotam, Telangana, Tel

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 56,000

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 61,100

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube