న్యూస్ రౌండప్ టాప్ 20
TeluguStop.com
H3 Class=subheader-style1.సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదల/h3p
సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలను ఈరోజు యూపీఎస్సీ విడుదల చేసింది.
మొత్తం 933 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ర్యాంకులను వెల్లడించింది.h3 Class=subheader-style2.
అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్/h3p """/" /
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఈనెల 25న విచారించాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది.
H3 Class=subheader-style3.తిరుమల భద్రత పై టీటీడీ దృష్టి/h3p
తిరుమల భద్రత పై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఇటీవల జరిగిన ఘటన నేపథ్యంలో నిఘా మరింత బలోపేతం చేయాలని టిటిడి నిర్ణయించింది.
కేంద్ర ఐబి, ఇంటిలిజెన్స్ అధికారులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.h3 Class=subheader-style4.
చెన్నైలో శరత్ బాబు అంత్యక్రియలు/h3p """/" /
టాలీవుడ్ నటుడు శరత్ బాబు అంత్యక్రియలను నేడు చెన్నైలో నిర్వహించనున్నారు.
H3 Class=subheader-style5.ఎమ్మెల్యే గిరిధర్ కు జగన్ పరామర్శ/h3p
ఎమ్మెల్యే మద్దాలి ఆయన కుటుంబ సభ్యులను ఏపీ సీఎం జగన్ పరామర్శించారు .
ఎమ్మెల్యే గిరిధర్ తల్లి శివపార్వతి మరణించడంతో జగన్ ఆమె చిత్రపటానికి నివాళులర్పించి ఎమ్మెల్యేను ఓదార్చరు.
H3 Class=subheader-style6.జగన్ కు పోలీసు అధికారుల సంఘం కృతజ్ఞతలు/h3p """/" /
ఇటీవల పోలీసులు ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు 554 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ ను కలిసిన పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
H3 Class=subheader-style7.శరత్ బాబు కుటుంబ సభ్యులకు జగన్ సానుభూతి/h3p
సీనియర్ నటుడు శరత్ బాబు మృతి చెందడంపై ఏపీ సీఎం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
H3 Class=subheader-style8.నేటి నుంచి నోట్ల మార్పిడి/h3p """/" /
2000 కరెన్సీ నోటును చలమణి నుంచి పూర్తిగా ఉపసంహరిస్తున్నట్లు ఆర్బిఐ ప్రకటించిన నేపథ్యంలో వీటిని ఈరోజు నుంచి బ్యాంకులో మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
బ్యాంకులో ఒక టర్మ్ లో 20 వేల వరకు మార్చుకునే అవకాశం కల్పించారు.
H3 Class=subheader-style9.తెలంగాణ దశాబ్ది ఉత్సవాల లోగో ఆవిష్కరణ/h3p
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల లోగో ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.
H3 Class=subheader-style10.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కామెంట్స్/h3p """/" /
ఇకపై హెచ్చరికలు లేకుండా గెరిల్లా తరహా ఉద్యమాలు చేపడతామని వైసిపి బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
H3 Class=subheader-style11.అవినాష్ రెడ్డి వ్యవహారంపై సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్/h3p
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
సిబిఐ విచారణతో ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదని సజ్జల వ్యాఖ్యనించారు.h3 Class=subheader-style12.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌస్ అరెస్ట్/h3p """/" /
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
గాంధీనగర్ లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నేడు నిరసన ఉన్నట్లు ఎమ్మెల్యే ప్రకటించడంతో ముందస్తుగా అయినను అరెస్ట్ చేశారు.
H3 Class=subheader-style13.నేడు రేపు ఓ మోస్తారు వర్షాలు/h3p
తెలంగాణలో మంగళ బుధవారాల్లో కొన్ని జిల్లాలు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
H3 Class=subheader-style14.రేషన్ డీలర్లతో మంత్రి గంగుల చర్చలు సఫలం/h3p """/" /
వచ్చే నెల ఐదు నుంచి నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నట్లు రేషన్ డీలర్ల ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించింది.
ఈ మేరకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో జరిపిన చర్చలు ఫలించాయని రేషన్ డీలర్ల సమైక్య ప్రకటించింది.
H3 Class=subheader-style15.మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : కేసీఆర్/h3p
మైనారిటీల అభివృద్ధి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.
H3 Class=subheader-style16.యాదాద్రి సంస్కృత పాఠశాలలో ప్రవేశాలు/h3p """/" /
యాదగిరిగుట్ట విద్యాపీఠం 2022 -23 విద్యా సంవత్సరానికి సంస్కృత కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తుంది.
H3 Class=subheader-style17.చంద్రయాన్ 3 ప్రయోగం/h3p
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న చంద్రయాన్ 3 ప్రయోగాన్ని జులై 12న నిర్వహించనుంది.
H3 Class=subheader-style18.చేప ప్రసాదం పంపిణీ/h3p """/" /
జూన్ 9న చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
H3 Class=subheader-style19.హీరోయిన్ డింపుల్ హైతి పై క్రిమినల్ కేసు/h3p
హీరోయిన్ డింపుల్ హైతి పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ఓ ఐపీఎస్ అధికారికి చెందిన కారును ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతో పాటు , పార్కింగ్ స్థలంలో అడ్డంకులు కలిగిస్తున్న టాలీవుడ్ హీరోయిన్ తో పాటు, ఆమె స్నేహితుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p """/" /
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 56,000
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 61,100
.