సినిమా సెలబ్రిటీలు అంటేనే మీడియా వారిపై పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తుందనే విషయం మనకు తెలిసిందే.ఇలా ఎంతోమంది సెలబ్రిటీలకు సంబంధించిన వృత్తిపరమైన వ్యక్తిగత జీవితాల గురించి ఎన్నో రకాల వార్తలు వస్తూనే ఉంటాయి.
ముఖ్యంగా పలానా హీరో హీరోయిన్స్ ఎఫైర్స్ కొనసాగిస్తున్నారని పలాన వారితో ప్రేమలో పడ్డారంటూ ఎన్నో రకాల వార్తలు వస్తూ ఉంటాయి.నటి కీర్తి సురేష్ (Keerthy Suresh) కూడా ఇలాంటి వార్తలలో నిలిచారు.
కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని ఒక బిజినెస్మెన్ తో తనకు వివాహం జరగబోతోంది అంటూ పెద్ద ఎత్తున తన పెళ్లి గురించి వార్తలు వచ్చాయి.
ఈ విధంగా కీర్తి సురేష్ తన పెళ్లి గురించి వచ్చిన వార్తలపై ఎన్నోసార్లు స్పందించి ఆ వార్తలను ఖండించారు.
అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక అబ్బాయితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు.అయితే ఈ ఫోటోలో ఇద్దరు కూడా ఒకే రంగు దుస్తులు ధరించడం విశేషం.
దీంతో మరోసారి కీర్తి సురేష్ గురించి వార్తలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలో ఉన్నది కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండ్ అని, తనని ఈమె పెళ్లి (Marriage) చేసుకోబోతున్నారు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలపై కీర్తి సురేష్ స్పందించారు.
ఈ సందర్భంగా కీర్తి సురేష్ ట్విట్టర్ వేదికగా ఈ ఫోటో గురించి స్పందిస్తూ… ఈసారి నా బెస్ట్ ఫ్రెండ్(Best Friend) ని ఈ వార్తలలోకి తీసుకువచ్చారా? నా జీవితంలో నిజమైన మిస్టరీ మ్యాన్ ను తప్పకుండా సమయం వచ్చినప్పుడు రివిల్ చేస్తాను.అప్పటిదాకా చిల్ గా ఉండండి అంటూ కీర్తి సురేష్ కామెంట్ చేశారు.అయితే ఈ ఫోటోలో ఉన్నది కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే వాడు కాదని కేవలం తన బెస్ట్ ఫ్రెండ్ అని అర్థమైంది.
అయితే ఈమె చేసిన ఈ కామెంట్ కనుక చూస్తే తన లైఫ్ లో మిస్టరీ మాన్ కచ్చితంగా ఉన్నారని తెలుస్తోంది.మరి ఆ వ్యక్తిని ఈమె ఎప్పుడు పరిచయం చేయబోతున్నారో వేచి చూడాల్సిందే.