Aishwarya Rajesh : ప్రభాస్ వల్లే నా సినిమా ఫ్లాప్ అయ్యింది : ఐశ్వర్య రాజేష్ 

ఏదైనా పెద్ద సినిమా విడుదలవుతుంది అంటే దానికి ముందుగా ఏ సినిమా కూడా రావడానికి ఇష్టపడదు.ఆ సినిమా హవా ముందు ఎంత పెద్ద చిత్రమైనా కొట్టుకుపోతుంది అనే భయం సినిమా మేకర్స్ లో ఉంటుంది.

 Aishwarya Rajesh About Prabhas-TeluguStop.com

ఇక చిన్న సినిమాల సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు.వారు ఎవ్వరూ లేని సమయంలో అలా థియేటర్లలో దూరి వెళ్ళిపోవాల్సిందే.

అందులో కొన్ని హిట్ అవుతుంటాయి కొన్ని ఆనవాళ్లు కూడా లేకుండా వెళ్ళిపోతుంటాయి.అయితే ఎలాంటి నోన్ పేస్ లేకుండా మంచి కథతో సినిమా తీస్తే కూడా ఒక పెద్ద సినిమా ముందు నిలబడదు అని నిరూపించిన సంఘటన ఒకటి చోటుచేసుకుంది ఆ సినిమా పేరు కౌసల్య కృష్ణమూర్తి అందులో నటించిన హీరోయిన్ పేరు ఐశ్వర్య రాజేష్.

Telugu Aiswarya Rajesh, Prabhas, Sahoo-Telugu Stop Exclusive Top Stories

పేరుకే తెలుగమ్మాయి కానీ ఐశ్వర్య రాజేష్ ( Aishwarya Rajesh ) మొదటి నుంచి తమిళ్ హీరోయిన్ గానే గుర్తించబడుతోంది.ఆమెకు తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ పెద్దగా లేకపోయినా తెలుగు హీరోలు కూడా ఆమెను ఆదరించిన సందర్భాలు లేవు.పైగా తమిళ్ లో స్కిన్ టోన్ ఎలా ఉన్నా కూడా ఒప్పుకుంటారు కాబట్టి ఈ కాస్త చామన చాయ ఉన్న ఐశ్వర్య తొందరగా తానేంటో అక్కడ నిరూపించుకుంది.ఆమె మెయిన్ లీడ్ గా నటించిన సినిమా కౌసల్య కృష్ణమూర్తి( Kausalya Krishnamurthy ).రైతు, క్రికెట్ అనే ఈ రెండు భిన్నమైన ధృవాలను కలుపుతూ తీసిన ఈ సినిమా ఆ తమిళనాడులో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.అయితే అదే సినిమాను తెలుగులో కూడా విడుదల చేశారు సదరు సినిమా నిర్మాత.

Telugu Aiswarya Rajesh, Prabhas, Sahoo-Telugu Stop Exclusive Top Stories

సరిగ్గా ప్రభాస్( prabhas ) నటించిన సాహూ( Sahoo ) సినిమా వారం ముందే కౌసల్య కృష్ణమూర్తి తెలుగులో విడుదల అయ్యింది.అయితే కాస్త హీరోయిన్ కథ ఏంటో జనాలు అర్థం చేసుకునే లోపే సాహో రావడంతో ఆ ప్రభంజనంలో ఇక కౌసల్య కృష్ణమూర్తి థియేటర్లలో కనిపించకుండా వెళ్ళిపోయింది .ఒక వారంలో నాలాంటి ఒక అనామకురాలు సినిమా తీస్తే అది ఎంత పెద్ద చిత్రమైనా కూడా ప్రభాస్ ముందు నిలబడలేదు కాబట్టి తన సినిమా కూడా అలా కొట్టుకుపోయింది అంటూ ఇటీవల ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేష్ తెలిపింది.పైగా ఈ సినిమా ఫెయిల్ అవ్వడం పట్ల తనకు ఎంతో బాధ కలిగిందని కానీ జెమిని వారు ముందుకొచ్చి ఈ సినిమా కొనడంతో టీవీలో సూపర్ హిట్ అయిందని ఆ తర్వాత ఓటీటి లో కూడా ఈ చిత్రం ఎక్కడ ఉందో వెతుక్కుని మరీ జనాలు చూసారని అలా తనకు మ్యాజిక్ జరిగిందని ఐశ్వర్య తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube