టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి తీవ్రంగా మండిపడ్డారు.దివంగత నేత ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు.
ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా అడ్డుపడింది చంద్రబాబేనని మంత్రి కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పుడు ఎన్టీఆర్ పేరును చంద్రబాబు ఎలా తలచుకుంటారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో పేదలకు వైసీపీ ప్రభుత్వం ఇళ్లు ఇస్తుంటే చంద్రబాబు అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు.పేదలకు ఏనాడైనా చంద్రబాబు సెంటు భూమి అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు.







