టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి( Rajamouli ) ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.రాజమౌళి మహేష్ కాంబో మూవీ 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.
అయితే రాజమౌళి సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.తాజాగా జక్కన్న ప్రథమేశ్ సమాధాన్ జావ్కర్( Prathamesh Samadhan Javkar ) గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
ప్రథమేశ్ సూపర్ అని మన దేశంలో అర్చరీ మరింత వృద్ధి చెందడం చూసి మనస్పూర్తిగా సంతోషిస్తున్నానని రాజమౌళి పేర్కొన్నారు.అద్భుతమైన ప్రతిభ అనేది వెలుగులోకి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.
షాంఘై ప్రపంచ కప్ లో( Shanghai World Cup ) స్వర్ణాన్ని గెలుపొందినందుకు ప్రథమేశ్ కు అభినందనలు అని జక్కన్న కామెంట్లు చేశారు.అతడు మరెన్నో సక్సెస్ లను అందుకోవాలని కోరుకుంటున్నానని రాజమౌళి చెప్పుకొచ్చారు.

మహారాష్ట్ర ( Maharashtra )రాష్ట్రానికి చెందిన ప్రథమేశ్ షాంఘైలో తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు.పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రపంచ ఛాంపియన్ షిప్ విజేత అయిన మైక్ స్కోసర్ ను ప్రథమేశ్ ఓడించారు.ప్రథమేశ్ పదిహేను బాణాలలో ఒక్కసారి మాత్రమే ఏకంగా 9 పాయింట్లను స్కోర్ చేయడం గమనార్హం.మిగిలిన బాణాలన్నీ పదిని తాకాయి.ప్రథమేశ్ టాలెంట్ కు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.

నాలుగు సెట్లు ముగిసే సమయానికి 119 119 తో స్కోర్ ఈక్వల్ అయింది.చివరి సెట్లో ప్రథమేశ్ మూడు ప్రయత్నాలలో 10 స్కోర్ సాధించగా మైక్ ఒకసారి మాత్రం గురి తప్పారు.రాజమౌళి ప్రథమేశ్ టాలెంట్ ను ప్రశంసిస్తూ చేసిన ట్వీట్ కు దాదాపుగా 15,000 లైక్స్ వచ్చాయి.
ప్రథమేశ్ టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.ప్రథమేశ్ రాబోయే రోజుల్లో కూడా మరిన్ని అవార్డులను గెలుచుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.







