ఈ మధ్య కాలంలో మలయాళం సినిమాలకు( Malayalam movies ) తెలుగు లో మంచి డిమాండ్ ఉంది.కొన్ని సినిమాలను రీమేక్ చేస్తుంటే మరికొన్ని సినిమాలను డబ్బింగ్ చేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.మలయాళం సినిమాలు తెలుగు లో రీమిక్స్ అయ్యి రూ.100 కోట్ల వసూళ్లు సొంతం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.అందుకే ఏ ఒక్క మలయాళం సినిమాని కూడా వదిలి పెట్టకుండా తెలుగు ఫిలిం మేకర్స్( Telugu film makers ) డబ్బింగ్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అందులో భాగంగానే మలయాళం లో ఇటీవల విడుదలై చాలా తక్కువ సమయం లోనే రూ.100 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసిన 2018 సినిమా ను తెలుగు లో డబ్బింగ్ చేసేందుకు రెడీ అయ్యారు.మెగా కాంపౌండ్ కు చెందిన బన్నీ వాసు ఈ సినిమా ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

ఇప్పటికే 2018 సినిమా యొక్క డబ్బింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యాయి.అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ వారంలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారు.భారీ అంచనాల నడుమ తెలుగులో విడుదల చేయాలని బన్నీ వాసు ప్రయత్నిస్తున్నాడు.అయితే 2018 సినిమాలో తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయా అంటే డౌటే అనే అనుమానం కొందరు వ్యక్తం చేస్తున్నారు.
సినిమా యొక్క కంటెంట్ చాలా విభిన్నంగా ఉంటుంది.తెలుగు ప్రేక్షకులు నచ్చుతారా లేదా అనే విషయాన్ని క్లారిటీ లేదు.2018 సంవత్సరంలో కేరళలో( Kerala ) వచ్చిన తుఫాన్ దాని వల్ల తలెత్తిన పరిణామాల నేపద్యంలో ఈ సినిమాను రూపొందించడం జరిగింది.భావోద్వేగభరిత సన్నివేశాలు కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
తద్వారా సినిమా భారీగా విజయాన్ని సొంతం చేసుకుని కనీసం పాతిక కోట్ల రూపాయల వసూళ్లు నమోదు చేసే అవకాశం లేకపోలేదు అంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.మరి బన్నీ వాసు కి కలెక్షన్స్ భారీగా నమోదయి సక్సెస్ ని దక్కించుకుంటుందా అనేది చూడాలి.







