ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయాలపై( Hindu Temples ) దాడులు, పిచ్చిరాతలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో భారత హైకమీషనర్ మన్‌ప్రీత్ వోహ్రా( Manpreet Vohra ) ఆ దేశ అధికారులపై తమకు నమ్మకం వుందన్నారు.
ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.మా విజ్ఞప్తిపై ఆస్ట్రేలియా( Australia ) అధికారుల నుంచి ప్రతిస్పందన వస్తుందని మన్‌ప్రీత్ ఆకాంక్షించారు.
చట్టాన్ని ఉల్లంఘించే, ద్వేషపూరిత నేరాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటారనే విశ్వాసం తమకు వుందని ఆయన పేర్కొన్నారు.
పపువా న్యూగినియా పర్యటనను ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ( PM Modi ) ఈరోజు ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు.
హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడంపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో మోడీ చర్చిస్తారా అన్ని అంశంపై వోహ్రా స్పందించారు.ఇక్కడ హిందూ దేవాలయాలపై దాడుల అంశం భారత్‌లో ఆందోళన కలిగిస్తోందన్నారు.
దీనిపై గతంలోనే అల్బనీస్ సైతం ఆందోళన వ్యక్తం చేశారని.ఆయన భారత పర్యటన సందర్భంగా ఈ విషయంపై హామీ కూడా ఇచ్చారని మన్‌ప్రీత్ గుర్తుచేశారు.

ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన చర్చల సందర్భంగా ఈ విషయాన్ని మోడీ లేవనెత్తారని హారత హైకమీషనర్ తెలిపారు.ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులు భారత్‌ను ఆందోళనకు గురిచేశాయని ప్రధాని పేర్కొన్నారు.దీనిపై స్పందించిన ఆసీస్ ప్రధాని. పోలీసులు, భద్రతా ఏజెన్సీల ద్వారా నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.ఇకపోతే.ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు.
ఆయన పర్యటనపై మన్‌ప్రీత్ మాట్లాడుతూ.ఆస్ట్రేలియా ప్రధానితో మోడీ కీలకమైన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని తెలిపారు.

కాగా.గత కొన్నినెలల నుంచి ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులు ఎక్కువయ్యాయి.మార్చిలో బ్రిస్బేన్‌లోని శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయం, అంతకుముందు జనవరిలో క్యారమ్ డౌన్స్‌లోని శ్రీ శివ విష్ణుదేవాలయం, అదే నెలలో మిల్‌పార్క్‌లో వున్న బీఏపీఎస్ స్వామి నారాయణ మందిర్‌పై దుండగులు దాడికి పాల్పడటంతో పాటు ఆలయ గోడలపై భారత వ్యతిరేక రాతలు రాశారు.







