Nayanthara : అందరి ముందు బన్నీని ఘోరంగా అవమానించిన నయనతార.. అప్పటి విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

సామాన్యులకైన, ఒక గొప్ప హోదాలో ఉన్న వాళ్ళకైనా అవమానం జరిగితే అస్సలు జీర్ణించుకోలేక పోతారు.ఇక అవమానం పదిమందిలో జరిగితే మాత్రం తల ఎత్తుకోలేకపోతుంటారు.

 Nayanthara Insulted Bunny Badly In Front Of Everyone-TeluguStop.com

అయినా కూడా కొంతమంది అవమానం జరిగినా ఓపికగా కనిపిస్తూ ఉంటారు.అలా ఓసారి అల్లు అర్జున్( Allu Arjun ) కు కూడా అవమానం జరిగితే ఏమాత్రం బాధపడకుండా ఓపికగా కనిపించాడు.

ఇక ఆయనను అవమానించింది ఎవరో కాదు నయనతార.లేడీస్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార( Nayanthara ) సినిమా విషయాలు పక్కకు పెడితే వ్యక్తిగతంగా మాత్రం బాగా రాష్ గా ప్రవర్తిస్తుంది అని అప్పట్లో బాగా వార్తలైతే వచ్చాయి.

నటి వరకు మాత్రమే ఈమె పై అభిమానం చూపించవచ్చు కానీ.వ్యక్తిగతంగా మాత్రం ఈమెను అభిమానించలేం అంటున్నారు కొంతమంది ప్రేక్షకులు.

Telugu Allu Arjun, Kollywood, Nayanthara, Tollywood-Movie

ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఆమె ప్రవర్తన అలా ఉంటుందట.నిజానికి ఈమె వ్యక్తిగత విషయంలో కూడా చాలా సార్లు వార్తలోకెక్కింది.ఇప్పుడు డైరెక్టర్ విగ్నేష్ శివన్( Vignesh Sivan ) ను పెళ్లి చేసుకొని సెటిల్ అయింది కానీ.ఈయన కంటే ముందు మరో ఇద్దరితో గాఢంగా ప్రేమాయణం జరిపింది ఈ హాట్ బ్యూటీ.

ఆ సమయంలో ఈమె తన బాయ్ ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి.ఇక వారిని పెళ్లి చేసుకోవాలని కూడా ఫిక్స్ అయింది.

కానీ అంతలోనే బ్రేకప్ అని చెప్పి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది.ఇక ఆ తర్వాత కొంతకాలానికే తమిళ డైరెక్టర్ విగ్నేష్ తో ప్రేమలో పడి అతనితో కొంతకాలం సహజీవనం చేసి ఆ మధ్యనే పెళ్లి చేసుకుంది.

ఇక సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలను సొంతం చేసుకుంది.మొత్తానికి పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది.

పెళ్లి తర్వాత కూడా కుటుంబం కంటే ఎక్కువగా సినిమాలకే ప్రాధాన్యత ఇస్తుంది.

Telugu Allu Arjun, Kollywood, Nayanthara, Tollywood-Movie

అయితే ఈమె గురించి అప్పుడప్పుడు కొన్ని వార్తలు బాగా వైరల్ అవుతూ ఉంటాయి.అయితే తాజాగా మరో వార్త బయటకు వచ్చింది.అదేంటంటే గతంలో తను అల్లు అర్జున్ ని అందరి ముందు అవమానించింది అని తెలిసింది.

అయితే అసలు విషయం ఏంటంటే.తను పెళ్లికి ముందు తన భర్త డైరెక్షన్లో ఒక సినిమా చేయగా ఆ సినిమాలో తనకు బెస్ట్ యాక్టర్ గా అవార్డు వచ్చింది.

ఇక ఆ అవార్డును అల్లు అర్జున్ చేతుల మీదుగా నయనతార కు ఇవ్వాలి అని అనౌన్స్ చేశారు.దీంతో అల్లు అర్జున్ తో పాటు నయనతార, డైరెక్టర్ విగ్నేష్ వేదిక మీదికి రాగా.

వెంటనే నయనతార అవార్డు డైరెక్టర్ విగ్నేష్ చేతుల మీదుగా తీసుకోవాలని ఉందని.అల్లు అర్జున్ తో వద్దని అనటంతో అల్లు అర్జున్ ఏ మాత్రం ఫీల్ అవ్వకుండా ఆ అవార్డును విగ్నేష్ కు ఇచ్చాడు.

దీంతో అతడు నయనతారకు అందజేశాడు.అయితే ఆ సమయంలో నయనతార అతనితో సీక్రెట్ లవ్ నడుపుతుండగా అతని చేతుల మీదుగా తీసుకోవాలన్న ఆశతో అల్లు అర్జున్ ను అవమానించింది.

ఇక ఆ సమయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆమెపై బాగా ఫైర్ అయ్యారు.లవ్ చేసే వాళ్లకు ఇంపార్టెంట్ ఇవ్వాలి కానీ ఇంతలా ఇవ్వద్దు అంటూ గతంలో ఫైర్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube