మనిషి చర్మంలా కనబడుతున్న మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్... అమేజింగ్ గురూ!

జపనీస్ ఆర్టిస్ట్ అయినటువంటి ‘మసటక శిశిదొ’ స్వతహాగా డీజే కూడా వాయిస్తాడు.అందుకే ఇతగాడిని డీజే డో అని కూడా అక్కడ పిలుస్తూ వుంటారు.

 Japanese Artist Turns Heads With Freaky Flesh-like Accessories Details, Musical-TeluguStop.com

మొదటిసారి తన డెబ్యూ ఆల్బమ్ చేసిన క్రమంలో ఒక సిలికాన్ ఫ్లెష్ కోటింగ్ వేసిన మ్యూజిక్ ప్యాడ్ని వాడాడట.ఆ తర్వాత అచ్చం మనిషి చర్మంలా అనిపించే, హైపర్ రియలిస్టిక్ ఫ్లెష్తో( Hyper Realistic Flesh ) కొన్ని ఆకారాలు అతగాడు తయారు చేశాడు.

వాటిలో మనిషి ముఖం, పెదాలు, కళ్లు వంటి భాగాలు వేటికవే వేరువేరుగా తయారు చేశాడట.మొదటిసారి వాటిని చూసినవారికి ఆశ్చర్యంతోపాటు, కొంచెం భయం కూడా వేస్తుంది మరి.

Telugu Flesh, Skin, Hyperrealistic, Japan Artist, Latest, Musical, Ups-Latest Ne

ఇక వాటిని చూసిన స్థానికులు ఇంకా బాగా చేయమని ఎంకరేజ్ చేస్తున్నారట.మరికొంతమంది అలాంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్( Music Instruments ) తమకి కూడా కావాలని అందుతున్నారని వినికిడి.దాంతో ఆ జర్నీని కంటిన్యూ చేస్తున్నాడు శిశిదొ.( Shishido ) అసలు ఇలాంటివి తయారుచేయాలనే ఆలోచన మనోడికి ‘హారర్ సినిమా ‘ది ఫ్లై’ చూసి వచ్చిందట.అతగాడు సైన్స్ ఫిక్షన్ సినిమాలు బాగా చేస్తాడట.ఆ సినిమాలు చూడడం వల్లే ఇలాంటి ఆలోచన వచ్చిందని చెబుతున్నాడు.

అప్పటి నుంచి డైలీ వాడే కొన్ని వస్తువుల్ని ఉపయోగించి, ‘మనిషి చర్మం(హ్యూమన్ ఫ్లెష్)’ తయారుచేశాడటా.

Telugu Flesh, Skin, Hyperrealistic, Japan Artist, Latest, Musical, Ups-Latest Ne

అప్పటి నుంచి ఫాక్స్ ఫ్లెష్ యాక్సెసరీలు తయారుచేయడం కూడా కంటిన్యూ చేసానని చెప్పుకొస్తున్నారు.ఇప్పటి వరకు తయారుచేసిన వాటిలో మనిషి నోటి ఆకారంలో ఉండే నాణేలు వేసుకునే చిన్న పర్స్, చేతి వేలి ఆకారంలో ఉన్న స్టాంప్ హోల్డర్, ఐ ఫోన్ కేస్ వంటివి ప్రజలను చాలా మెప్పించాయని చెప్పుకొస్తున్నారు.చాలామంది నుంచి అలాంటివి తయారుచేసివ్వమని ప్రీ ఆర్డర్లు ఇవ్వడం మొదలు పెట్టారట.

కాగా వీటి ధర వెయ్యి నుంచి నాలుగు వేల డాలర్లు ఉంటుంది.అయినా, వీటిని కొనేందుకు ప్రజలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నందుకు హ్యాపీగా ఉందని శిశిదొ చెబుతూ… వాటితో త్వరలోనే సొంత ఎగ్జిబిషన్ పెట్టాలనుకుంటున్నట్టు చెబుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube