మధ్యప్రదేశ్( Madhya Pradesh )లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వరాల జల్లు కురిపిస్తోంది.
ఇటీవల, తీర్థయాత్రలకు వెళ్లే సీనియర్ సిటిజన్లకు ఉచిత విమాన ప్రయాణాన్ని అందిస్తామంటూ ప్రకటించి సంచలనం సృష్టించింది.ఇలాంటి ఆఫర్ ఇచ్చిన మొదటి రాష్ట్రం మనదేనని పేర్కొంటూ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది.‘ముఖ్యమంత్రి తీర్థ్-దర్శన్ యోజన'( Mukhyamantri Tirth Darshan Yojana ) ప్రోగ్రామ్‌లో భాగంగా నెట్టిజనులను ఫ్రీగా తీసుకెళ్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఇందులో భాగంగా ఇప్పటికే 24 మంది పురుషులు, ఎనిమిది మంది స్త్రీలతో కూడిన 32 మంది యాత్రికుల బృందాన్ని మే 21న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్( Prayagraj 0కు ఉచితంగా తీసుకెళ్లింది.మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్‌లోని రాజా భోజ్ విమానాశ్రయం నుంచి ఆ విమానాన్ని జెండా ఊపి ప్రారంభించారు.విమాన ప్రయాణం ద్వారా సీనియర్ సిటిజన్లను తీర్థయాత్రలకు పంపాలనే కల సాకారమైనట్లేనని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
మే, జులై మధ్యకాలంలో సీనియర్ సిటిజన్ల అనేక బ్యాచ్‌లను విమానాల్లో ఉచితంగా తీసుకెళ్లడానికి ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించింది.ఆ ప్రణాళిక ప్రకారం మే 23న అగర్-మాల్వా జిల్లాకు చెందిన యాత్రికుల బృందం ఇండోర్ నుంచి విమానంలో మహారాష్ట్రలోని షిర్డీ( Shirdi 0కి బయలుదేరుతుంది.
అదేవిధంగా, రెండు రోజుల తరువాత, బేతుల్ జిల్లా నుంచి యాత్రికులు భోపాల్ నుంచి బయలుదేరే విమానంలో మధుర-బృందావన్ సందర్శన కోసం ఆగ్రాకు వెళతారు.మే 26న ఇండోర్ నుంచి షిర్డీకి మరో విమానం దేవాస్ జిల్లా నుండి యాత్రికులను తీసుకువెళుతుంది.

ఇంకా, జూన్ 3న, ఖాండ్వా జిల్లాకి చెందిన సీనియర్ సిటిజన్లు( Senior Citizens ) గంగాసాగర్ సందర్శన కోసం ఇండోర్ నుంచి కోల్‌కతాకు వెళ్లే విమానంలో ఎక్కుతారు.సీఎం చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం( BJP Government ) 2012లో లాంచ్ చేసిన ముఖ్యమంత్రి తీర్థ్-దర్శన్ యోజన ప్రోగ్రామ్ తీర్థయాత్రలలో సీనియర్ సిటిజన్లకు ఉచిత ప్రయాణాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.గతంలో ఈ పథకం లబ్ధిదారులు తమ ప్రయాణాలకు ప్రత్యేక రైళ్లను ఉపయోగించేవారు.ఈ ప్రోగ్రామ్ ద్వారా దాదాపు 7.82 లక్షల మంది సీనియర్ సిటిజన్లు లబ్ది పొందారని ప్రభుత్వం పేర్కొంది.







