చాలా రోజులుగా మనం ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నాం.కాస్త కామెడీతో జనాలను నవ్వించగలిగే జబర్దస్త్ నటులంతా కూడా హీరోలు అయిపోదాం అని కలలు కంటూ ఉంటారు.
అందుకే జబర్దస్త్( Jabardast ) లో నటించే చాలా మంది హీరోలుగా, కమెడియన్స్ గా ఒక వెలుగు వెలిగారు.కానీ ఇప్పుడు పరిస్థితి మరొక విధంగా మారిపోయింది.
జబర్దస్త్ ను తొలినాలలో తమ కామెడీతో ఒక స్థాయిలో నిలిపిన వారందరూ కూడా ఇప్పుడు వేరే వేరే పనుల్లో సెటిలైపోయారు.కానీ జబర్దస్త్ సైతం సరైన రీతిలో నడవడం లేదు.
దాని స్థాయి తగ్గించుకుంటూ టీఆర్పీ రేటింగ్ కూడా పడిపోతూ వస్తోంది.

మొదట్లో బాగా ఉన్న టైంలో డబ్బులు వస్తున్నా కొద్ది హ్యాపీగానే ఉన్న కొన్నాళ్ల తర్వాత ఎన్నాళ్ళు ఈ చాకిరి చేస్తాం.ఇంకా ఈ కామెడీ వర్క్ అవ్వదు అన్న విధంగా సినిమా ఇండస్ట్రీకి వెళ్లిపోయారు కానీ ఆ తర్వాత అందరికీ జ్ఞానోదయం అయింది.చాలామంది కమెడియన్స్ తాము హీరోలు అవ్వలేము అనే తత్వం బోధపడ్డట్టుగా మళ్లీ జబర్దస్త్ కి రీఎంట్రీ ఇచ్చే పనిలో ఉన్నారు.
అలాంటి వారిలో షకలక శంకర్ ( Shakalaka Shankar )కూడా ఒకడు.మొదట్లో జబర్దస్త్ లో చాలా ఏళ్లపాటు బాగానే షోని నడిపించాడు.ఆ తర్వాత సినిమాలు అని, హీరోగా వెళ్లాలని నిర్ణయించుకుని జబర్దస్త్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు.

కానీ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అతనికి ఎలాంటి అవకాశాలు లేవు.ఎంతోమంది మెరిట్ ఉన్న కామెడీయన్స్ జబర్దస్త్ కి దూరం అయిపోతున్న ఈ తరుణంలో ఇలా సినిమాల్లో నెగ్గలేకపోతున్న పాత జబర్దస్త్ కమెడియన్స్( Jabardast Comedians ) ని మళ్ళీ షో కి తిరిగి తీసుకువచ్చే పనిలో పడ్డారు షో నిర్వాహకులు.షకలక శంకర్ కూడా తిరిగి జబర్దస్త్ కి వస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఏది ఏమైనా జబర్దస్త్ ఒక పాడి గేదె లాంటిది.పితికిన వాడికి పితుకున్నంత.
అందుకే ఎక్కడ అవకాశాలు లేకపోయినా జబర్దస్త్ లో ఎదో ఒకటి చేసి బ్రతికేయచ్చు అనే ధీమాలో ఉన్నారు.అందుకే ఈ పాత కమెడియన్స్ మళ్లి కొత్తగా ఎదో చేయాలనీ అనుకుంటున్నారు కానీ సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ టైం లో షో టిఆర్పి పెంచే సామర్ధ్యం వీరిలో ఉందా లేదా అని చూడాలి.







