యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young Tiger NTR ) హీరో గా నటించిన చిత్రాలలో సింహాద్రి( Simhadri ) గురించి ఎంత చెప్పిన అది తక్కువే అవుతుంది.ఈ సినిమా అప్పటికీ ఆయన ఇండస్ట్రీ కి వచ్చి కేవలం రెండేళ్లు మాత్రమే అయ్యింది.
అప్పటికీ ఆయన వయ్యస్సు కేవలం 19 ఏళ్ళు మాత్రమే, ఆ వయస్సు లో ఆయన సింహాద్రి చిత్రం తో చరిత్ర సృష్టించి మాస్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు.ఇక ఆ తర్వాత ఆయనకీ వరుసగా ఫ్లాప్స్ వచ్చినప్పటికీ చెక్కు చెదరని క్రేజ్ ఏర్పడింది.
అలాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ఇటీవలే ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేసారు.దీనికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ, కొన్ని చోట్ల మాత్రం డిజాస్టర్ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.
ముఖ్యంగా నైజాం ప్రాంతం గురించి మనం మాట్లాడుకోవాలి.ఈ ప్రాంతం ఎన్టీఆర్ కి వీక్ జోన్ అని ట్రేడ్ పండితులు అంటూ ఉంటారు.

ఆయన ఎంత వీక్ అనేది ఈ రీ రిలీజ్ తో అందరికీ అర్థం అయిపోయింది.హైదరాబాద్ ( Hyderabad )లో ఈ చిత్రానికి గ్రాండ్ గా సెలెబ్రిటీలను పిలిచి ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసారు.తెలంగాణ వ్యాప్తంగా షోస్ కూడా భారీ స్థాయిలోనే వేసుకున్నారు.కానీ కలెక్షన్స్ మాత్రం నిల్, హైదరాబాద్ ప్రాంతం లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 40 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, మొదటి రోజు పూర్తి అయ్యేసరికి నైజాం ప్రాంతం మొత్తం కలిపి 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఈ చిత్రానికి విడుదలకు ముందు చేసిన పబ్లిసిటీ తో పోలిస్తే చాలా తక్కువ అని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఖుషి చిత్రం కేవలం పది రోజుల ముందు కంఫర్మ్ చేసుకొని విడుదల అయ్యి కోటి 60 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఇదే ప్రస్తుతానికి ఆల్ టైం రికార్డు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జల్సా చిత్రం కోటి 20 లక్షల రూపాయిలు వసూలు చెయ్యగా, ఒక్కడు చిత్రం 90 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది.

కానీ సింహాద్రి చిత్రానికి కేవలం 65 లక్షల రూపాయిల గ్రాస్ రావడం అందరినీ షాక్ కి గురి చేసింది.తెలంగాణ లోని కరీంనగర్ వంటి ప్రాంతాలలో ఈ చిత్రానికి కొన్ని థియేటర్స్ లో సున్నా గ్రాస్ లు కూడా వచ్చాయి.ఇది ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో కి కూడా జరగలేదు, తెలంగాణ లో ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చినా, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం మంచి వసూళ్లనే రాబట్టింది.
మొత్తం మీద రెండు రోజులకు కలిపి ఈ సినిమా మూడు కోట్ల 60 లక్షల రూపాయల గ్రాస్ సాధించి రీ రిలీజ్ చిత్రాలలో ఆల్ టైం టాప్ 2 గ్రాసర్ గా నిల్చింది.సింహాద్రి చిత్రం ఆ కాలం లో ఊర మాస్ సినిమా అయ్యుండొచ్చు కానీ, నేటి తరానికి ఆ చిత్రం అవుట్ డేటెడ్ మాస్ సినిమా అని, అందుకే ఈ చిత్రానికి ఫ్యాన్స్ తప్ప కామన్ ఆడియన్స్ థియేటర్స్ కి కదలలేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.







