సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా వ్యాపార రంగాలలో కూడా స్థిరపడుతున్న విషయం మనకు తెలిసిందే.ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రెటీలు వివిధ వ్యాపార రంగాలలో రాణిస్తూ ఉన్నారు.
ఇక దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార ( Nayanatara ) సైతం పలు వ్యాపార రంగాలలో స్థిరపడి ముందుకు సాగుతున్నారు.దక్షిణాది సిని ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్నటువంటి నయనతార ఇప్పటికే నిర్మాణ సంస్థను స్థాపించిన విషయం మనకు తెలిసిందే.

ఇలా సొంత బ్యానర్ లో సినిమాలను నిర్మిస్తూ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఈమె వ్యాపారంలో కొనసాగుతున్నారు.అలాగే కొన్ని బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు.అయితే తాజాగా ఈమె మరో వ్యాపార ( Busines s) రంగంలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తుంది.ఈసారి ఈమె థియేటర్ అధినేతగా మారిపోతున్నట్టు సమాచారం.ప్రస్తుత కాలంలో ఎన్నో థియేటర్లో మూతపడుతున్నాయి.మరికొన్ని మూత పడిన థియేటర్లో మల్టీప్లెక్స్ గా రూపుదిద్దుకొని ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తున్నాయి.
ఈ క్రమంలోనే నయనతార సైతం ఇలా మూతబడిన థియేటర్ ను కొనుగోలు చేసే దానిని మల్టీప్లెక్స్ ( Multiplex ) గా మార్చబోతున్నారని తెలుస్తుంది.

ఇటీవల కాలంలో చెన్నైలో మూతబడిన అగస్త్య థియేటర్ ను నయనతార కొనుగోలు చేయాలని భావిస్తున్నారట ఇలా ఈ థియేటర్ ను కొనుగోలు చేసి ఈమె దీనిని మల్టీప్లెక్స్ గా మార్చాలని భావించారట.ప్రస్తుతం నయనతారకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.కానీ ఇప్పటివరకు ఈ విషయానికి సంబంధించి ఎలాంటి అధికారక ప్రకటన వెలువడలేదు.
ఇక ఈమె గత ఏడాది దర్శకుడు విగ్నేష్ శివన్( Vignesh Shivan ) ను వివాహం చేసుకొని ఇద్దరు కవల పిల్లలకు సరోగసి ద్వారా తల్లి అయ్యారు.అయితే నయనతార పెళ్లి అయినప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.
ఇలా హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు వ్యాపార రంగంలో కూడా నయనతార దూసుకుపోతున్నారు.







