వామ్మో జైపూర్ ప్యాలెస్ లో శర్వానంద్ పెళ్లి కోసం ఒక్క రోజుకు ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో తెలుసా?

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్( Sharwanand ) మరి కొద్ది రోజులలో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతున్న విషయం మనకు తెలిసిందే.ఈ ఏడాది జనవరి నెలలో ఈయన తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డి( Rakshitha Reddy ) ని ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న విషయం మనకు తెలిసిందే.

 Do You Know How Many Crores Are Being Spent For Sharwanand's Wedding ,sharwanan-TeluguStop.com

వీరి నిశ్చితార్థానికి ఎంతో మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు.ఇలా నిశ్చితార్థం జరుపుకున్న శర్వానంద్ పెళ్లి మాట ఎత్తకపోవడంతో వీరి వివాహం రద్దయిందంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.

అయితే అవన్నీ కేవలం అవాస్తవాలేనంటూ శర్వానంద్ టీమ్ ఈ వార్తలను కొట్టి పారేశారు.

ఇక శర్వానంద్ రక్షితల వివాహ తేదీని కూడా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.వీరిద్దరి వివాహం జూన్ 2,3వ తేదీలలో జైపూర్ ( Jaipur )లోని లీలా ప్యాలెస్ ( Leela Palace)లో ఎంతో ఘనంగా జరగబోతున్నట్లు ఇరువురి కుటుంబ సభ్యులు వీరి పెళ్లి తేదీని ప్రకటించారు.ఇలా వీరి వివాహం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇరువురి కుటుంబ సభ్యులు పెళ్లి పనులలో బిజీగా ఉన్నారు.

ఇక వీరి వివాహానికి కేవలం సన్నిహితులు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నట్టు తెలుస్తుంది.ఇక వీరి వివాహం జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో నిర్వహించబోతున్నారు అంటే భారీగానే ఖర్చు చేస్తున్నారని తెలుస్తుంది.

ఇలా లీలా ప్యాలెస్ లో ఒకరోజు విడిది చేయాలి అంటే సుమారు నాలుగు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందట.ఇలా శర్వానంద్ రెండు రోజుల కోసం దాదాపు 8 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది.జూన్ మూడవ తేదీ రక్షిత మెడలో శర్వానంద్ తాళికట్టబోతున్నారు.జూన్ రెండున ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఈ ప్యాలెస్ లోనే ప్రారంభం కానున్నాయని తెలుస్తుంది.

జూన్ 2వ తేదీ ఉదయం మెహందీ,( Mehindi ) సాయంత్రం సంగీత్ (Sangeeth) వేడుకలు జరుగునున్నట్టు తెలుస్తుంది.ఏది ఏమైనా శర్వానంద్ ఆలస్యంగా పెళ్లి చేసుకున్న చాలా ఘనంగా పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube