ఈసారి మోడీకి ఆ దైర్యం లేదా ?

2016 నవంబర్ నవంబర్ 8 అందరికీ గుర్తుండే ఉంటుంది.ఈ రోజున ప్రధాని నరేంద్ర మోడీ( PM Modi ) రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి దేశ ప్రజలకు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు.ఈ నోట్లు చలామణిలో ఉండడం వల్ల అవినీతి జరుగుతోందని, నల్లధనం ( Black Money ) పెరిగి దేశ ఖజానాకు భంగం వాటిల్లుతోందని చెబుతూ.ఈ నోట్లు మార్చుకోవాలని, లేదంటే చెల్లవాని చెప్పడంతో దేశ ప్రజలు ఎదుర్కొన్నా ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు.

 Modi Does Not Have That Courage This Time Details, Modi, Prime Minister Modi, De-TeluguStop.com

గంటల తరబడి ఎటిఎం ల ముందు నిల్చోవడం, బ్యాంకుల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాయడం.అబ్బో ఒక్కటేంటి.అప్పట్లో ప్రజలు ఎదుర్కొన్నా ఇబ్బందులు ఇప్పటికీ కూడా కళ్ళముందు కదలాడుతూనే ఉన్నాయి.

Telugu Rs Notes Ban, Central, Modi, Narendra Modi, Prime Modi-Politics

కాగా పాత రూ.500, రూ.1000 నోట్ల స్థానంలో కొత్త రూ.500, మరియు రూ.2000 రూపాయల నోట్లను ప్రవేశ పెట్టారు.అయితే వీటికి అలవాటు పడడానికి ప్రజలకు చాలానే సమయం పట్టింది.ఈ సందర్భంలో మోడీ నిర్ణయంపై వినిపించిన విమర్శలు అన్నీ ఇన్ని కావు.అయితే విదేశాల్లో ములుగుతున్న నల్లధనాన్ని బయటకు తెచ్చేందుకే నోట్ల రద్దు అని చెప్పిన కేంద్రప్రభుత్వం.ఎంతవరకు ఆదిశగా కేంద్రప్రభుత్వం సక్సస్ అయిందంటే చెప్పలేని పరిస్థితి.ఇంకా రూ.2000 నోట్ల రాకతో బ్లాక్ మనీ తరలించడం చాలా సులభమైందనేది కొందరి వాదన.దీంతో మోడీ తీసుకున్న నిర్ణయం ఒక తుగ్లక్ చర్య అని ప్రతిపక్షాలు గట్టిగానే దుమ్మెత్తిపోశాయి.మళ్ళీ ఇన్నాళ్లకు రూ.2000 రూపాయలను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ( RBI ) ప్రకటించింది.

Telugu Rs Notes Ban, Central, Modi, Narendra Modi, Prime Modi-Politics

ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే అప్పుడు నోట్ల రద్దు( Demonetization ) ప్రకటించింది ప్రధాని నరేంద్ర మోడీ.కాగా ఇప్పుడేమో ఆర్బీఐ ప్రకటించింది.దీంతో మోడీ ఈ విషయంలో ఎందుకు ప్రజల ముందుకు రాలేదనే దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.

ఈసారి ఆ విధంగా ప్రజల ముందుకు వచ్చి ప్రకటన చేస్తే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారని, ఘాటైన విమర్శలు చేస్తారని కేంద్రం భావించి ఉండవచ్చనేది కొందరు చెబుతున్నా మాట.అది కాస్త వచ్చే ఎన్నికల్లో బిజెపి పై గట్టిగానే ప్రభావం చూపే అవకాశం ఉంది.అందుకే జరగబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని తెలివిగా మోడీ సర్కార్ ఆర్బీఐతో రూ.2000 నోట్ల రద్దు ను ప్రకటించిదనేది విశ్లేషకులు చెబుతున్నా మాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube