తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్( Bandi Sanjay ) ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు.ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా( BJP ) కొనసాగుతున్న బండి ఎన్నికల వరకు ఇదే పదవిలో కొనసాగుతారా లేదా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ఈ అనుమానాలు రావడానికి ప్రధాన కారణం కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడమే.ఈ ఓటమి తెలంగాణ బీజేపీ వ్యూహాలను గట్టిగానే ప్రభావితం చేస్తోంది.
మతపరమైన విధానాలతో ఓట్లు కొల్లగొట్టే బీజేపీ.ఆ వ్యూహం కర్నాటకలో బెడిసి కొట్టింది.
తెలంగాణలో కూడా బండి సంజయ్ మతప్రతిపాధికగానే పోలిటికల్ హీట్ పెంచుతుంటారు.

దీంతో ఈ విధానం వల్ల తెలంగాణలో కూడా బీజేపీకి షాక్ అవకాశం ఉందని అధిష్టానం భావిస్తోందట.ఈ కారణంగానే అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తప్పించాలని డిల్లీ పెద్దలు వ్యూహాలు రచిస్తున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.కర్నాటక ఎన్నికల ఫలితాల తరువాత అనూహ్యంగా డిల్లీ పెద్దల నుంచి ఈటెల రాజేందర్ కు ( Etela Rajender ) పిలుపు రావడంతో ఈ వార్తలు మరింత చర్చకు దారి తీస్తున్నాయి.
అయితే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించేందుకే డిల్లీ పెద్దలు ఈటెల రాజేంద్ర పిలుపునంపారాని బీజేపీ వర్గం నుంచి వినిపిస్తున్న మాట.అయితే అధ్యక్షుడు బండి సంజయ్ ని కాదని ఈటెల ను పిలవడం వెనుక అధ్యక్ష మార్పుకు సంబంధీచిన చర్చే ప్రధాన కారణం అనేది కొందరి విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట.

ఇదిలా కొనసాగుతుండగా ఈటెల డిల్లీ పర్యటన ముగించుకొని గురువారం హైదరబాద్ రాగా.ఆ వెంటనే బండి సంజయ్ శుక్రవారం డిల్లీ పయనం అయ్యారు.అయితే డిల్లీ పెద్దల నుంచి బండికి ఎలాంటి పిలుపు రానప్పటికి ఆయన డిల్లీ వెళ్లారు.వ్యక్తిగత కారణాల చేతనే బండి సంజయ్ డిల్లీ వెళ్లరాని ఆయన సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట.మరి ఆయన ఇంత సడన్ గా డిల్లీ ఎందుకు వెళ్లవలసి వచ్చింది అంటే అధ్యక్ష పదవి విషయంలో తనను తొలగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో క్లారిటీ కోసమే ఆయన డిల్లీ వెళ్లారనేది కొందరి అభిప్రాయం.మొత్తానికి ఎన్నికల ముందు అధ్యక్ష పదవి మార్పులో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే డౌట్ బండి సంజయ్ లో గట్టిగానే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.







