ఆ మూవీ సమయంలోనే పవిత్రతో పరిచయం.. నరేష్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

నరేష్ పవిత్ర లోకేశ్( Naresh Pavitra lokesh ) జోడీ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ జోడీ ఎన్నో సినిమాలలో కలిసి నటించగా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.

 Naresh Comments About Where He Het Pavitra Lokesh Details Here Goes Viral Detail-TeluguStop.com

మళ్లీ పెళ్లి( Malli pelli ) సినిమాతో నరేష్, పవిత్ర సక్సెస్ ను సొంతం చేసుకోవడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన నరేష్ పవిత్ర షాకింగ్ విషయాలను వెల్లడించడం జరిగింది.

Telugu Happy, Malli Pelli, Naresh, Nareshpavitra, Pavitra, Pavitra Lokesh-Movie

నా 1000 కోట్ల రూపాయల ఆస్తిలో వారసత్వంగా వచ్చిన ఆస్తితో పాటు సంపాదించిన ఆస్తి కూడా ఉందని నరేష్ అన్నారు.అమ్మ, కృష్ణగారు ఇన్ స్పిరేషన్ అని నరేష్ తెలిపారు.ప్రస్తుత కాలంలో తోడు అనేది చాలా ముఖ్యమని ఆయన కామెంట్లు చేశారు.హ్యాపీ వెడ్డింగ్( Happy Wedding movie ) సినిమా సమయంలో మా ఇద్దరికీ పరిచయం ఏర్పడి ఫ్రెండ్స్ అయ్యి రిలేషన్ షిప్ లోకి వచ్చామని నరేష్ కామెంట్లు చేశారు.

Telugu Happy, Malli Pelli, Naresh, Nareshpavitra, Pavitra, Pavitra Lokesh-Movie

కెమిస్ట్రీ లేకపోతే ఎవరు ప్రపోజ్ చేసినా సక్సెస్ కాదని ఆయన తెలిపారు.కృష్ణ, విజయనిర్మల ఎవరూ ఎవరి నుంచి ఏమీ ఆశించలేదని నరేష్ అన్నారు.నేనే ప్రపోజ్ చేశానని ఆయన తెలిపారు.ఎం.ఎస్ రాజు గారి సూచన మేరకు నేను ఈ సినిమాలో నటించానని నరేష్ పేర్కొన్నారు.పవిత్ర వేల పుస్తకాలు చదువుతుందని ఆయన తెలిపారు.

సినిమా అనేది బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అయిపోయిందని నరేష్ చెప్పుకొచ్చారు.

సొసైటీలో ఉన్న సమస్యలను తీసుకున్న సమయంలో యాదృచ్చికంగా కొన్ని కనిపిస్తాయని ఆయన తెలిపారు.

తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా తీశామని నరేష్ అన్నారు.కృష్ణగారు బ్రతికి ఉన్న సమయంలోనే ఈ సినిమా మొదలైందని నరేష్ పేర్కొన్నారు.

సినిమాలో అందరూ సీనియర్ యాక్టర్లు ఉన్నారని ఆయన తెలిపారు.కోర్టులు సైతం ప్రస్తుతం సహజీవనాన్ని అంగీకరిస్తున్నాయని నరేష్ పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube