ఏ సినిమా ( Movie ) విజయం అయిన ఎవరు నిర్ణయిస్తారు… ప్రేక్షకులా ? లేదా రివ్యూ రాసేవారా ? ఉదాహరణకి రాజకీయాలనే తీసుకుందాం.రాజకీయాలను ఎవరు ఎలా డిసైడ్ చేస్తారు.
ఎలక్షన్స్ నిర్వహించి ఒక ప్రాసెస్ ద్వారా ఎన్నుకుంటారా లేదంటే మేధావులు చెప్పిన మాటలు, సర్వేలు అంటూ ఎవరికి నచ్చినట్టుగా వారు ఇచ్చే ఒక రివ్యూ ని ఆధారంగా చేసుకుని ఫలానా క్యాండిడేట్ మంచివాడు లేదా ఫలానా క్యాండిడేట్ చెడ్డవాడు అనే ఒక నిర్ధారణకు వస్తారా ? అలా ఇవ్వడం కుదరదు కదా ? అలాగే ఏ సినిమా విషయంలో అయినా కూడా కొన్ని లక్షలు, కోట్లు ఖర్చుపెట్టి తీస్తారు.ఎంతో మంది జీవితాలు ఆ సినిమాపై ఆధారపడి ఉంటాయి.
ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది.

ఇన్ని విషయాలతో ముడిపడి ఉన్న ఒక సినిమాను తలా తోకాలేని ఒక బోడిలింగం రివ్యూ రాసి( Review ) డిసైడ్ చేస్తే సరిపోతుందా ? పలానా రివ్యూ రాసేవాడు ఇంట్లో గొడవపడి వచ్చి లేదా వాడి ప్రెజర్ అంతా కూడా సినిమాపై చూపిస్తే ఓకేనా? తాగి రివ్యూ రాసే జనాలు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు అంటే నమ్ముతారా ? ఇలాంటి రివ్యూలను ఆధారంగా చేసుకుని ఒక సినిమా భవిష్యత్తును నిర్ణయించడం ఎంతవరకు కరెక్ట్ ? రాజకీయం, సినిమా ఏదైనా కూడా ఒక కొంత మంది నిర్ణయిస్తే సరిపోదు కదా.అది నిజమైన ఫలితం కాదు కదా.రాజకీయాల్లో ఎవరు ఎందుకు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారో తెలుసుకోవడం కోసమే ఎలక్షన్ అనే ఒక ప్రాసెస్ ఏర్పడింది.కానీ సినిమా ఫలితం( Movie Result ) నిర్ణయించడానికి ఇలాంటి ఒక సిస్టం లేదు.అందుకే చాలా వరకు సినిమా ఫలితాన్ని రివ్యూ ఇచ్చేవాళ్లే నిర్ణయిస్తున్నారు.

మెజారిటీ ప్రేక్షకులకు సినిమా నచ్చిందా లేదా తెలుసుకోవడం అసంభవంగా మారింది.ఇక ఆ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకుడి యొక్క టాక్ హిట్టు లేదా ఎవరేజా, ఫ్లాపా అని తెలుసుకోవడం ఎంతో కష్టంతో కూడుకున్న పని.అందుకే మంచి సినిమాలను ఈ రివ్యూ అనే ఒక నేరగాడి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది.ఎవరికి నచ్చినట్టు వారు రివ్యూ రాసుకుంటూ వెళ్లడం వడ వల్ల సినిమా ఇండస్ట్రీ నుంచి నిర్మాతలు, నటులు, దర్శకులు కనుమరుగైపోతున్నారు.
వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది.రివ్యూ రాసే వారి నుంచి అలాంటి వారిని కాపాడాలని కోరుకుంటున్నాను.







