రాజమౌళి వినాయక్ ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా వెలుగు వెలిగారు.రాజమౌళి ( Rajamouli ) ఇప్పటికీ పాన్ వరల్డ్ డైరెక్టర్ గా కెరీర్ ను కొనసాగిస్తుండగా వినాయక్ ( VV Vinayak ) మాత్రం వరుస ఫ్లాపులతో కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
అయితే రాజమౌళిని ఫాలో అయ్యి రెండు డిజాస్టర్లను వినాయక్ ఖాతాలో వేసుకున్నారు.వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా వినాయక్ జక్కన్నను ఫాలో కాకుండా ఉండి ఉంటే బాగుండేదని కొంతమంది చెబుతున్నారు.
2009 సంవత్సరంలో చరణ్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన మగధీర సినిమా( Magadheera ) థియేటర్లలో విడుదలైంది.ఈ సినిమా అప్పట్లో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
అయితే ఈ సినిమాను స్పూర్తిగా తీసుకుని వినాయక్ బన్నీ కాంబోలో బద్రీనాథ్ సినిమాను( Badrinath ) ప్లాన్ చేశారు.మగధీర సినిమాలా బద్రీనాథ్ సినిమా కోసం భారీ బడ్జెట్ ను కేటాయించారు.
అయితే మగధీర మ్యాజిక్ ను బద్రీనాథ్ మూవీ రిపీట్ చేయలేకపోయింది.

ఆ తర్వాత తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఛత్రపతి సినిమాను అదే పేరుతో హిందీలో రీమేక్ చేయగా అక్కడ మాత్రం ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.ఛత్రపతి సినిమా భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది.ఒక విధంగా రాజమౌళిని ఫాలో అయ్యి వినాయక్ కెరీర్ ను నాశనం చేసుకున్నారనే చెప్పాలి.
వినాయక్ కు కొత్త ఆఫర్లు రావడం రావడం లేదు.స్టార్ హీరోలు ఎవరూ వినాయక్ ను నమ్మడం లేదు.

వినాయక్ తన సొంత కథలతో సినిమాలను తెరకెక్కిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వినాయక్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.వినాయక్ కు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఈ కామెంట్లపై వినాయక్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.







